హృతిక్ తో ఎన్టీఆర్ కు తలనొప్పి..!

బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తలనొప్పిగా మారాడు.అదెలా అంటే జూనియర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్నాడు.

 Ntr Headache For Hrithik Mohenja-daro Release-TeluguStop.com

సినిమా స్టార్ట్ అయిన నాటి నుండే సినిమా ఆగష్టు 12 రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు.అయితే ఇప్పుడు అదే డేట్ కు హృతిక్ రోషన్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మొహెంజోదారో రిలీజ్ అవుతుంది.

బాలీవుడ్లోనే కాదు ఆ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి భారీగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

అశుతోష్ గోవికర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది.

సౌత్ లో హీరోయిన్ గా క్రేజ్ సంపాదించిన పూజా హెద్గె ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.అంతేకాదు సినిమా కోసం హృతిక్ తో లిప్ లాక్ సీన్స్ కూడా నటించింది అమ్మడు.

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రోజే తెలుగులో కూడా మొహెంజోదారో రిలీజ్ అవ్వడం వల్ల తారక్ కలక్షన్స్ కు కాస్త గండి పడే అవకాశం ఉంది.

ఇక హృతిక్ సినిమానే కాదు నాగ చైతన్య ప్రేమమ్, నిఖిల్ నటిస్తున్న ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలు కూడా ఆగష్టు మొదటి రెండు వారాల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరి వీటన్నిటిలో క్రేజీ సినిమా జూనియర్ దే అయినా ఏమాత్రం తేడా వచ్చినా మిగిలిన సినిమాలు రెచ్చిపోయే అవకాశం ఉంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube