యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్పుడెప్పుడో వెంకటేష్, అనుష్క హీరోయిన్గా నటించిన ‘చింతకాయల రవి’ సినిమాలో తళుక్కున మెరిసిన విషయం తెల్సిందే.ఒక పాటలో వెంకీతో కలిసి ఎన్టీఆర్ సెప్పులు కూడా వేశాడు.
ఆ తర్వాత మరే సినిమాలో కూడా ఎన్టీఆర్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వలేదు.అయితే ఇన్నాళ్లకు మళ్లీ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ సినిమా అయిన ‘పటాస్’లో గెస్ట్‌గా కనిపించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ రహస్యంగా ఉంచాలని భావించింది.అయినా కూడా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లోకి వచ్చినట్లుగా చెబుతున్నారు.
కళ్యాణ్ రామ్ సక్సెస్ కోసం ఎన్టీఆర్ పరితపిస్తున్నాడు.అందుకే అన్న సినిమాలో తన వంతు పాత్ర పోషించి సక్సెస్‌ను ఇవ్వాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
‘పటాస్’ ప్రారంభ వేడుకలో పాల్గొన్న ఎన్టీఆర్ ఇటీవల జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో కూడా పాల్గొన్న విషయం తెల్సిందే.అలాగే సినిమాలో కూడా ఎన్టీఆర్ నిజంగానే కనిపిస్తే ఇక నందమూరి అభిమానులకు పండుగే అంటున్నారు విశ్లేషకులు.