కొరటాలకి భారి బహుమతిని ఇస్తున్న ఎన్టీఆర్?

జనతా గ్యారేజ్ కి ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా హంగామా చేయలేదు.అపుడెప్పుడో ఆది, సింహాద్రి, మధ్యలో యమదొంగ సంచలనాలుగా నిలిస్తే.

 Ntr And Mythri To Present A Costly Gift To Koratala?-TeluguStop.com

అదుర్స్, బృందావనం, టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలు సక్సెస్ ని సొంతం చేసుకున్నా, రికార్డుల మోత మోగించలేదు.మళ్ళీ ఇన్నాళ్ళకు ఎన్టీఆర్ కెరీర్ మరో ఎత్తుకు చేరింది.

క్లుప్తంగా చెప్పాలంటే జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ కెరీర్ ని రిపేర్ చేసింది

మరి అంతటి సంచలన హిట్ ని అందించిన దర్శకుడు అంటే హీరోకి కృతజ్ఞతాభావం ఉంటుంది కదా.రెండు ఫ్లాపుల తరువత హిట్ దొరికిందని మహేష్ బాబు కొరటాలకి ఆడి కార్ ని బహుమతిగా ఇచ్చాడు.ఇప్పుడు ఎన్టీఆర్ అంతకంటే కాస్ట్లీ బహుమతే ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి

తమకు రెండు బ్లాక్ బస్టర్స్ ని అందించినందుకు మైత్రీ మూవి మేకర్స్ నిర్మాతలు, ఎన్టీఆర్ తో కలిసి కొరటాల శివ కి ఏకంగా ఓ “విల్లా”ని బహుమతిగా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు టాక్.హైదరాబాదులో ఇప్పటికే మంచి విల్లా కోసం వెతుకులాట మొదలుపెట్టారని ఫిలింనగర్ జనాలు చర్చించుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube