దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్

సినిమా హీరో అంటే ఈకాలంలో కేవలం సెట్ కి వచ్చి మేకప్ వేసుకోని, ఇచ్చిన డైలాగులు చెప్పేసి వెళ్ళిపోవడమే కాదు, బయటి ప్రపంచం మీద అవగాహన ఉండాలి.తన మార్కెట్ స్థాయి ఏంటో, బాక్సాఫీస్ వద్ద తన సినిమాల పరిస్థితి ఏంటో తెలుసుకుంటూ ఉండాలి.

 Not Dil Raju But Sharwanand To Earn Profits-TeluguStop.com

అప్పుడే, తన మార్కెట్ కి తగ్గ సినిమాలని ఎంచుకోవడం జరుగుతుంది.ఈ బిజినెస్ లెక్కల్లో ఇప్పటికే శర్వానంద్ ఆరితెరిపోయాడు.

రన్ రాజా రన్ సబ్జెక్ట్ కి టెక్నికల్ టీం సపోర్ట్ ఎక్కువ కావాలని, తన పారితోషికం తగ్గించుకున్నాడు.ఫలితం, ఆ సినిమా తన కెరీర్ ని మలుపు తిప్పింది.

అప్పటినుంచి శర్వానంద్ ప్రతి అడుగు వేసేముందు ముందు వెనుక బాగా ఆలోచిస్తున్నాడు.తన మార్కెట్ పరిధిని పెంచుకుంటున్నాడు.

అలాగాని ఫైనాన్షియల్ గా తానేమి కోల్పోవట్లేదు.తాజా ఉదాహరణ శర్వానంద్ కి బిజినెస్ పై ఉన్న పట్టుకి నిదర్శనం.

శతమానం భవతి సినిమాకి శర్వానంద్ పారితోషికం ఏమి తీసుకోలేదట.బదులుగా ఓవర్సీస్ హక్కులు కావాలని అడిగాడట.

ఆరకంగా ఓవర్సీస్ హక్కులు రెండున్నర కోట్లకి అమ్ముకోవడంతోనే సరిపెట్టుకోకుండా, ఈ సినిమాకి ప్రీమియర్స్ బాగా ప్లాన్ చేసాడు.ఓవర్సీస్ జనాలకి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కావడంతో శర్వ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఆలాగే మూడురోజుల వీకెండ్ మిస్ అవలేదు.ఫలితం, మొదటి మూడు రోజుల్లోనే పెట్టిన దాంట్లో సగం రాబట్టేసుకున్నారు పంపినిదారులు.

ఇదే ట్రెండ్ కంటిన్యు అయితే, ఇటు డిస్ట్రిబ్యుటర్స్, అటు శర్వానంద్ .భారి లాభాల్లో పడతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube