రవితేజ-సురేందర్ రెడ్డి మధ్య ముదిరిన గొడవ

రవితేజ సురేందర్ రెడ్డిలది మొన్నటిదాకా హిట్ పెయిర్.కిక్ లాంటి కల్ట్ బ్లాక్బస్టర్ ఇచ్చింది ఈ ద్వయం.కిక్-2 ఫ్లాప్ అవడం ఏంటో కాని గొడవలు మొదలయ్యాయి ఇద్దరి మధ్య.ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు.

 No Ravi Teja In Kick 3 ?-TeluguStop.com

నేను సినిమా నిడివి ఎక్కువ అయిపోతోంది అని ఎంత చెప్పినా సురేందర్ వినలేదు, అందుకే సినిమా ఫ్లాప్ అయింది అని రవితేజ వాదన.రవితేజ వయసు వల్ల అంతా యంగ్ క్యారెక్టర్ పండలేదు, అందుకే సినిమా ఆడలేదు అన్నది సురేందర్ రెడ్డి వాదన.

ఈ గొడవల కారణంగా సురేందర్ రెడ్డి చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కిక్-3 లో రవితేజను కొనసాగించే ఉద్దేశ్యంలో సురేందర్ రెడ్డి లేనట్లు వార్తలు వస్తున్నాయి.అటు రవితేజ కుడా మళ్ళి సురేందర్ తో పని చేయాలనుకోవట్లేదట.

కిక్-3 లో హీరో ఎవరు ? కథ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి , మళ్ళి వక్కంతం వంశినే రచయితగా కొనసాగిస్తారా ? మాస్ మహారాజ టైమింగ్ ను కొట్టగలిగే హీరోను సురేందర్ ఎక్కడినుంచి తీసుకొస్తున్నారు ? ఇవన్ని అంతు చిక్కని ప్రశ్నలు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube