మహేష్ - పవన్ సినిమాలు కోనేందుకు ధైర్యం చేయట్లేదు వాళ్ళు .. ఎందుకంటే

సూపర్ స్టార్ మహేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .ఈ పేర్లు చాలు జనాల్ని సినిమా థియేటర్లకు రప్పించడానికి.

 No Overseas Takers For Mahesh And Pawan Films-TeluguStop.com

వీరి సినిమాలకు వచ్చే రికార్డులే పై స్టెట్‌మెంట్ కి నిదర్శనం.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లో కూడా ఇద్దరికి బ్రహ్మాండమైన మార్కేట్ ఉంది.

అయినా వీరి సినిమాలు కొనేందుకు ధైర్యం చేయడం లేదు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్.

మహేష్ బాబుని ఓవర్సీస్ కింగ్ అని అంటారు.

మహేష్ సినిమాలతోనే ఈ అమెరికా, ఆస్ట్రేలియా మార్కేట్స్ మనకు దొరికాయి.తెలుగు రాష్ట్రాల్లో మహేష్ సినిమాలు ఫ్లాప్ అవతున్నా, ఓవర్సీస్ లో సక్సెస్ అవుతాయి.

అసలు మహేష్ కి ఓవర్సీస్ లో ఎప్పటికైనా నష్టాలు తెచ్చిన సినిమా ఉంటుందా అని అందరు అనుకుంటున్న సమయంలో బ్రహ్మోత్సవం దారుణంగా దెబ్బతీసింది.హీరో మహేష్ అయినా సరే, సినిమా బాగాలేకపోతే మేం చూడము అంటూ మహేష్ కి యూఎస్ లో తొలి ఫ్లాప్ కట్టబెట్టారు.

ఇక పవన్ గత రెండు సినిమాలు ఓవర్సీస్ పంపిణీదారులకి చుక్కలే కాదు, పాలపుంత కూడా చూపించాయి.వీరి గత సినిమాలయ రక్తకన్నీరు తెప్పించినా, ఇప్పుడొస్తున్న సినిమాల రేట్లు తగ్గడం లేదు.

పవన్ త్రివిక్రమ్ సినిమాకి 16-18 కోట్లు చెబుతోంటే, స్పైడర్ కి ఏకంగా 26 కొట్లు అడుగుతున్నారు.ఇప్పుడు ఈ సినిమాలని కొనేందుకు ఓవర్సీస్ లో పంపిణీదారులు ముందుకు రావడం లేదు.

కారణం, పెరిగిన థియేటర్ రెంట్స్.

అమెరికా మొత్తం థియేటర్ రెంట్స్ పెంచేసారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయ్యర్లకి చేతికి అందేది గ్రాస్ లో 45% మాత్రమే అంట.ఇలాంటి పరిస్థితుల్లో ఆ రేట్లు పెట్టి ఈ ఇద్దరి సినిమాలు కొనడం మూర్ఖత్వమే అని భావిస్తున్నారట బయర్లు.రేట్లు తగ్గిస్తే తప్ప డీల్ లోకి దిగే సమస్యే లేదంట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube