ఆ రికార్డు ఎన్టీఆర్ - జ‌య ఇద్ద‌రిదే

రాజ‌కీయాల్లో ఇటు తెలుగునాట‌, అటు త‌మిళ‌నాట ఇద్ద‌రు నేత‌లు దేశం గ‌ర్వించ‌ద‌గిన రీతిలో వ్య‌వ‌హ‌రించిన రికార్డును సొంతం చేసుకున్నారు! త‌మ త‌మ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా తెలుగు నాట ఎన్‌టీఆర్‌, త‌మిళ‌నాట జ‌య‌ల‌లిత‌లు కేంద్రంతో చేసిన పోరు న‌భూతో న‌భ‌విష్య‌తి! కేంద్రం విష‌యంలో సాధార‌ణంగా ఏ ముఖ్య‌మంత్రి అయినా ఆచితూచి వ్య‌వ‌హ‌రించ‌డం క‌నిపిస్తుంది.కానీ, ఈ ఇద్ద‌రు మాత్రం త‌మ మాట విష‌యంలో కేంద్రంతో ఢీ అంటే ఢీ అనే రీతిలోనే వ్య‌వ‌హ‌రించారు.

 No One Can Replace Sr.ntr And Jayalalitha In Ruling-TeluguStop.com

ఏపీలో సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఎన్‌టీఆర్ త‌న ఎన్నిక‌ల హామీల్లో భాగంగా పేద‌ల‌కు రూ.2 కే బియ్యం ప‌థ‌కం అమ‌లు కోసం అవ‌స‌ర‌మైన బియ్యం ఇవ్వాల‌ని నేరుగా కేంద్రాన్ని అభ్య‌ర్థించారు.త‌మ‌కు కేటాయిస్తున్న బియ్యం కోటాను పెంచాల‌ని కోరారు.అయితే, దీనికి కేంద్రం తిర‌స్క‌రించింది.దీంతో ఆయ‌న ఎన్నిక‌ష్టాలు ప‌డైనా ఈ ప‌థ‌కాన్ని కొన‌సాగిస్తాన‌ని, వెన‌క్కితీసుకునేది లేద‌ని ఢిల్లీలోనే శ‌ప‌థం చేశారు.

ఆ త‌ర్వాత దాని అమ‌లు కోసం శ్ర‌మించారు.

అదేవిధంగా త‌న ప‌ద‌విని నాదెండ్ల భాస్క‌ర‌రావు స్వాధీనం చేసుకునేందుకు స‌హ‌క‌రించిన గ‌వ‌ర్న‌ర్ విష‌యంలో కేంద్రంతో అమీతుమీకి సిద్ధ‌మ‌య్యారు.ఈ ప‌రిణామం అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

ఇక‌, త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య కూడా త‌న మాట నిల‌బెట్టుకోవ‌డ‌మే ధ్యేయంగా కేంద్రంతో ఫైట్‌కి సిద్ధ‌ప‌డిన సంద‌ర్భాలు మ‌న‌కు క‌నిపిస్తాయి.వాజ్‌పేయి ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తిచ్చిన జ‌య‌.

ఆ సంద‌ర్భంలో త‌మిళ‌నాడులో అధికారంలో ఉన్న క‌రుణానిధి ప్ర‌భుత్వాన్ని బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని వాజ్‌పేయిని కోరారు.అయితే, రాజ‌కీయ కార‌ణాలే త‌ప్ప మ‌రో కోణం క‌నిపించ‌డం లేద‌న్న వాజ్‌పేయి జ‌య అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రించారు.

ఈ ప‌రిణామాన్ని తీవ్ర అవ‌మానంగా భావించిన జ‌య‌.ఉన్న ప‌ళాన కేంద్రానికి ఇస్తున్న మ‌ద్ద‌తును తిర‌స్క‌రించారు.

అంతే.ఇంకేముంది.

కేంద్రంలో వాజ్‌పేయి స‌ర్కారు కుప్ప‌కూలింది.ఇలా.ఈ ఇద్ద‌రు సీఎంలు కేంద్రంతో పోరాడిన నేత‌లుగా దక్షిణాదిన రికార్డు సృష్టించారు.ఆ త‌ర్వాత పాలించి ఏ నేతా కూడా ఇలాంటి రికార్డును సొంతం చేసుకోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube