అలా చేయటానికి హింట్ ఇఛ్చిన కాజల్

టాలీవుడ్లో ఎప్పుడు ఏదో ఒక రూమర్ సంచరిస్తూనే ఉంటుంది.ఫలనా స్టార్ హీరో సినిమాలో ఫలనా స్టార్ హీరో ఐటం సాంగ్ అంటా అంటూ ఒకటే రచ్చ.

 No-one Ask Me For Item Number Says Kajal-TeluguStop.com

అది నిజా కాదా అన్నది ఆలోచించరు.ఎలాగు ఆ హీరోయిన్ కు అవకాశాలు సన్నగిల్లాయి కాబట్టి అది నిజమే అయ్యుంటుంది అని న్యూస్ లు రాయడం మొదలు పెట్టారు.

తీరా చూస్తే ఆ హీరోయిన్ తిన్నగా అసలు తనని అలాంటివాటికి ఎవరు అడగలేదు.అడిగితే అప్పుడు చేసేది లేనిది చెప్తా అంటూ వయ్యారాలు పోతుంది.

ఇంతకీ ఈ కథా కమామిషు అంతా జరిగింది ఎవరి విషయలోనో మీకు ఇప్పటికే అర్ధమయ్యి ఉండొచ్చు.కొద్దిరోజులుగా రాం చరణ్ ధ్రువ సినిమాలో కాజల్ ఐటం సాంగ్ చేస్తుందని ఒకటే హడావిడి.

అసలు ఆ విషయం గురించి ధ్రువ యూనిట్ కు సంబందించి ఎవరు కాజల్ ను కన్సల్ట్ అవ్వలేదట.ఇంతలోనే చెర్రి, కాజల్ అదిరిపోయే ఐటం సాంగ్ అంటూ రాసేశారు.

ఒకవేళ వారు అడిగితే అప్పుడు చూస్తా కాని ఇప్పటివరకు అయితే అలాంటిది ఏమి లేదు అని కూల్ గా ఆన్సర్ ఇచ్చింది కాజల్.సో ఆఫర్ వస్తే ఇమ్మిడియెట్ ఓకే చెప్పేలానే ఉంది అమ్మడి వాలకం చూస్తుంటే.

ఆల్రెడీ రాం చరణ్ తో మూడు సినిమాలతో కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయిన ఈ భామ నిజంగా ఐటం సాంగ్ చేస్తే ఇక సీను సితార అన్నట్టే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube