మినిస్టర్లకు గౌరవ వందనం బంద్‌

ఆంగ్లేయులు మన దేశాన్ని వదలి వెళ్లిపోయినా ఇంకా వారి అవశేషాలు పాలనా విధానాల్లో కొనసాగుతూనే ఉన్నాయి.ఇప్పటికీ అనేక చట్టాలు బ్రిటిష్‌ హయాంలో రూపొందించినవే ఉన్నాయి.

 No More Guard Of Honour For Maharashtra Ministers-TeluguStop.com

ప్రధానంగా పోలీసు శాఖలో, పరిపాలనలో వలసవాద విధానాలు కనబడుతున్నాయి.వీటిని వదిలించుకోవాలని మన పాలకులు ఇప్పటివరకూ అనుకోలేదు.

కాని మహారాష్ర్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ అనుకున్నారు.మంత్రులకు పోలీసులు గౌరవ వందనం చేయడమేంటని ప్రశ్నించుకున్నారు.

ఈ వలసవాద విధానాన్ని ఇంకా అనుసరించడమేమిటని అనిపించిందేమో ఈ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు.మంత్రులు, ఉన్నతాధికారులు జిల్లాలకు వెళ్లినప్పుడు పోలీసులు పోలీసులు వారికి సలాం చేయక్కర్లేదని ప్రకటించారు.‘ఇది పనికిమాలిన పని.సమయం వృథా’ అని ఫడ్నవీస్‌ అన్నారు.వీవీఐపీలకు భద్రతలోనూ కోత పెట్టారు.వీఐపీ సంస్కృతిని రూపుమాపుతానని చెప్పారు కూడా.ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి అభ్యుదయకరమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది.ప్రజాస్వామ్యంలో భూస్వామ్య కాలం నాటి విధానాలు కొనసాగడమేమిటి?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube