బాహుబలి - 2 లో ఆ హీరోయిన్ లేదు

బాహుబలి – 2 మీద రోజురోజుకి అంచనాలతో పాటు రూమర్స్ కుడా పెరిగిపోతున్నాయి.రోజుకో కొత్తరకమైన గాస్సిప్ రాజమౌళి సినిమా మీదికి వదులుతున్నారు జనాలు.

 No Madhuri Dixit In Baahubali – 2-TeluguStop.com

బాహుబలి – 2 లో బాలివుడ్ అలనాటి లేడి సూపర్ స్టార్ మధురి దీక్షిత్ నటిస్తుందని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు అంటున్నాయి యూనిట్ వర్గాలు.

ఓ వార్తదాత దీనిపై స్పందిస్తూ ” రకరకాల రూమర్స్ రాస్తూనే ఉన్నారు బాహుబలి మీద.తాజాగా బాహుబలి సీక్వెల్ లో మధురి దీక్షిత్ నటించనుంది అని కొత్త పుకారు పుట్టించారు.పైగా అనుష్క సోదరి పాత్రలో మాధురి మెరుస్తుందని ఎవరికీ వారే కథలు అల్లేశారు.అందులో ఏమాత్రం నిజం లేదు.ఇప్పటివరకైతే బాహుబలి నటనా వర్గంలో ఎవరు కొత్తగా చేరలేదు.ఒకవేళ కొత్తగా ఎవరైనా వస్తే స్వయంగా రాజమౌళి తెలియజేస్తారు ” అని రూమర్స్ ని ఖండించారు,

ఇదే విషయమై ఒక జాతీయ పత్రిక స్వయంగా రాజమౌళిని సంప్రదిస్తే ఆయనే బాహుబలి -2 లో మాధురి దీక్షిత్ లేరని చెప్పారని ఫిలిం నగర్ లో చర్చించుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube