మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం రావాలంటే ఏమి చేయాలి?

ప్రతి ఒక్కరు దేవుని కృప కోసం నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు.అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే రెట్టింపు ఫలితాలను పొందవచ్చు.

 Nitya Pooja Vidhanam In Telugu-TeluguStop.com

వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి.

ముందు రోజు పూజ చేసిన అక్షంతలు మరియు పువ్వులు లేకుండా శుభ్రం చేసుకోవాలి.

దేవుడి గదిలో దేవుని విగ్రహాలను శుభ్రం చేసాక బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించాలి.

బొట్టు పెట్టటానికి గంధం ఉపయోగిస్తే మంచిది.

శివునికి విభూతి,విష్ణవుకి గంధం పెట్టాలి.

దీపారాధన చేసేటప్పుడు నూనె పోసాక ఒత్తులను వేయాలి.

దీపారాధనకు వెండి లేదా రాగి లేదా బంగారం కుందులను వాడితే మంచిది.

కుందెలో మూడు ఒత్తులను వేసి వెలిగించాలి.ఒక ఒత్తు వేసి వెలిగించకూడదు.

కుందెను కింద పెట్టకుండా పళ్లెం లేదా తమలపాకులో పెట్టాలి.

దీపం వెలిగించిన తరవాత దీపానికి బొట్టు పెట్టి అక్షంతలు మరియు పువ్వులు ఉంచాలి.

నైవేద్యాన్ని కేవలం వెండి ప్లేట్ లేదా తమలపాకులో మాత్రమే పెట్టాలి.

నైవేద్యం పెట్టిన తరవాత హారతి ఇవ్వాలి.

ఆ హారతి తరవాత రెండు చుక్కల నీళ్ళు జల్లి , ఆ తరవాత మనం కళ్ళకు అద్దుకోవాలి.

హారతి పూర్తి అయిన తరవాత, 2నిమషాలు పాటు మనం అక్కడ నుంచి వెళ్లిపోవాలి.స్వామివారి కంటి చూపు నైవేద్యం పై పడినా, అది మహా ప్రసాదం అవుతుంది.

అప్పుడు మనం ఆ ప్రసాదం తీసుకుని, అందరికి పంచి పెట్టాలి.

ఇలా అన్ని నియమాలను పాటిస్తూ పూజను శ్రద్దగా చేస్తే మంచి ఫలితం దక్కుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube