ఫిగర్ గురించి మాట్లాడుతున్న హీరోయిన్

నిత్య మీనన్ చాలా మొండిది అని అంటుంటారు అంతా.తన మాటలు వింటే నిజమేనేమో అనిపిస్తుంది.

 Nithya Menon Doesn’t Maintain Her Figure-TeluguStop.com

మిగితా హీరోయిన్లలాగా ఎత్తుగా, నాజుకుగా ఉండదు.అందాల ఆరబోతకు అరడజన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఇంత భిన్నంగా ఉన్నా నిత్యకు రావాల్సిన అవకాశాలు వస్తూనే ఉన్నాయి.ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి రొమాంటిక్ ప్రేమకథలు కుడా నిత్య ఖాతాలో పడటం విశేషం.

మరి కురచ దుస్తులు వేసుకోకుండా, సరైన ఫిగర్ మెంటేన్ చేయకుండా నిత్య ఎలా నెట్టుకొస్తోందో అనే కదా మన ఆలోచించేది.దీనికి తగ్గ సమాధానం నిత్య దగ్గర ఉందండోయ్ !

“నాకు అసౌకర్యవంతంగా అనిపించనిదేదీ నేను చేయను.

అందుకే కథ వినేటప్పుడే సన్నివేశాల గురించి, నేను వేసుకోబోయే బట్టల గురించి క్లియర్‌గా మాట్లాడేసుకుంటాను.నేను ఫిగర్ మెయిం టెయిన్ చేయను.

అందుకే కాస్త లావుగా ఉంటాను.ఇక పొడవు, పొట్టి, అందం… ఇవన్నీ ఇచ్చేది దేవుడు.

నా ప్రవర్తన సరిగ్గా లేకపోతే నన్ను విమర్శించాలి గానీ, దేవుడు ఇచ్చినవాటిని విమర్శించకూడదు.ఇలా ఉంటె అవకాశాలు తగ్గుతాయి అంటారు.

నాకు తగ్గలేదుగా! ఓ పాత్రకి నేనైతేనే సరిపోతాను అనుకున్నప్పుడు దర్శకులు నా దగ్గరకే వస్తున్నారు.వేరే వాళ్లకి ఇవ్వట్లేదుగా!” అంటూ మొండిగా చెప్పుకొచ్చింది నిత్య.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube