తెలంగాణ జనసేన అధ్యక్షుడిగా నితిన్ ?

ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న పరమభక్తుల్లో హీరో నితిన్ ఒకరు.ఇష్క్ సినిమా నుంచి మొదలు, పవర్ స్టార్ భజనతో, రిఫరెన్సులతో నితిన్ స్టార్ మారిపోయింది.

 Nithin To Lead Janasena In Telangana?-TeluguStop.com

అక్కడినుంచి ఇద్దరి మధ్య బంధం కూడా బాగా బలపడింది.ఎంతలా అంటే, తన పొలంలో పండించిన పంటలు, పండ్లు నితిన్ ఇంటికి పవన్ కళ్యాణ్ పంపేంతగా.

మెగాస్టార్ నుంచి వరుణ్ తేజ్ వరకు, ఎవరి సినిమాల ఫంక్షన్స్ కి వెళ్ళని పవన్, నితిన్ ఫంక్షన్స్ కి మాత్రం వెళ్ళేంతగా, ఆఖరికి రామ్ చరణ్ తో సినిమాని పక్కనపెట్టి పవన్ తన నిర్మాణంలో నితిన్ తో సినిమా మొదలుపెట్టేంతేగా.వీరి బంధం భవిష్యత్తులో రాజకీయంగా కూడా బలపడనుందని తెలుస్తోంది.

జనసేన పార్టీ ప్రస్తుతం కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కార్యకలాపాలు కొనసాగిస్తోంది.జనసేనను ఇటు తెలంగాణలో కూడా బలపరిచే ప్లాన్ ఉన్నాడట పవర్ స్టార్.

తెలంగాణలో పార్టీ బాధ్యతలు నితిన్ చేతిలో పెట్టాలనే ఆలోచన పవన్ మెదడులో ఉన్నట్లు ఫిలింనగర్ జనాలు మాట్లాడుకంటున్నారు.నితిన్ అంటే పవన్ కి పూర్తిగా అవగాహన ఉండటం, ఇద్దరి మధ్య స్నేహం, వీటితో పాటు పార్టీ కోసం డబ్బు ఖర్చుపెట్టగల కెపాసిటి నితిన్ దగ్గర ఉండటంతో, ఈ కుర్ర హీరోనే తెలంగాణలో పార్టీ అధ్యక్షుడి పదవికి అర్హుడని పవర్ స్టార్ భావిస్తున్నాడట.

అంతకుమించి చెప్పాలంటే, తెలంగాణ నుంచి వచ్చిన నటులందరిలోకి నితిన్ రేంజ్ వేరు.ఇన్ని క్వాలిటీస్ ఉన్నాక ఇంకేం కావాలి.

అయితే ఈ విషయం మీద ఇటు నితిన్ కాని, అటు పవన్ కాని ఎటువంటి ప్రకటన చేయలేదు.కాబట్టి అప్పుడే ఈ టాక్ ని నమ్మడానికి లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube