భారీ కి పెంచిన నితిన్..అంత సీన్ ఉందా..!

చెప్పుకోడానికి మాత్రం నితిన్ చాలా సీనియర్ హీరోనే అయినా ఇప్పటికి కుర్ర హీరోల్లా ప్రేమకథలతోనే ఆడియెన్స్ కు దగ్గరవుతున్నాడు.మాస్ హీరోగా తాను చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమవడంతో నితిన్ ఇక లవర్ బోయ్ గానే సినిమాలు చేస్తున్నాడు.

 Nithin Hike Remuneration For His Next-TeluguStop.com

ఇక రీసెంట్ గా త్రివిక్రం అఆతో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న నితిన్ కెరియర్లో బెస్ట్ హిట్ అందుకున్నాడు.సినిమాలో సమంత డామినేట్ చేసినా నితిన్ ఖాతాలో హిట్ పడ్డది.

సాధారణంగా హిట్ పడితే హీరోలు రెమ్యునరేషన్ పెంచడం మాములే.ఆ క్రమంలో నితిన్ కూడా తన పారితోషికం అమాంతంగా పెంచేశాడట.

ఇప్పటిదాకా 2-3 కోట్లు తీసుకునే నితిన్ ఇక నుండి 5-7 కోట్ల దాకా ఇస్తేనే అంటూ డిమాండ్ చేస్తున్నాడట.కెరియర్ లో 50 కోట్లు టచ్ చేసే సరికి తన లెవల్ పెరిగిందని భావిస్తున్న నితిన్ మరి రెమ్యునరేషన్ భారీగా తీసుకున్నా ఓకే కాని ఆ రేంజ్ హిట్ కూడా కొట్టాలి మరి.ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాకు రెడీ అయిన నితిన్ కు మరో ఇద్దరు ముగ్గురు దర్శకులు కథలు చెప్పి సినిమా తీసేందుకు రెడీగా ఉన్నారు.అఆతో వచ్చిన ఈ హిట్ జోష్ ను నితిన్ వచ్చే సినిమాలకు కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube