జాతీయ పోషకాహార సంస్థ చెప్పిన షాకింగ్ న్యూస్..

ప్రతీ నలుగురిలో ఒక్కరికి మధుమేహం.ప్రతీ ముగ్గురిలో ఒకరికి రక్తపోటు…ప్రస్తుతం నగరాల్లో ఉంటున్న వారి పరస్థితి.

 Nin Shocking Statement-TeluguStop.com

రోజువారి అవసరాలకంటే ఎక్కువ మోతాదులో పోషకాలు ,విటమిన్లు తీసుకోవడం మరియు ఒత్తిడితో కూడిన జీవితం .సరైన సమయానికి తినకపోవడం.ఇవి మధుమేహానికి కారణం కావచ్చు అని జాతీయ పోషకాహార సంస్థ చెప్తోంది.హైదరాబాదు లో అధికారిక కార్యాలయాన్ని స్థాపించి సుమారు వందవ సంవత్సరంలోకి అడిగుపెట్టిన సందర్భంగా ఈ సంస్థ చేసిన సర్వే తాలూకు విషయాలని బయటపెట్టింది.

2015–16 సంవత్సరంలో దేశవ్యాప్తంగా దాదాపు 1.72 లక్షల మందిపై చేసిన ఈ అధ్యయనంలో ఆహారం విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ ఏమిటన్నది స్పష్టం చేస్తోంది.మొత్తం 16 రాష్ట్రాల్లోని ప్రజలు ఒక రోజులో తీసుకుంటున్న ఆహారం ఆధారంగా ఆ సంస్థ ఓ నివేదిక రూపొందించింది.భారత వైద్య పరిశోధన సమాఖ్య నిర్దేశించిన పరిమితిలోనే ఆహార పదార్ధాలు వినియోగిస్తున్నారు అని.పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు, చక్కెర, బెల్లం వంటి వాటిని మాత్రం నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువగా తీసుకుంటున్నారు.ఐదేళ్ల లోపు పిల్లల్లో 25 శాతం మంది వయసుకు తగ్గ బరువు ఉండటం లేదు.

అలాగే 29 శాతం పిల్లల్లో శారీరక, మానసిక అభివృద్ధి తక్కువగా ఉంటోంది.పోషకాహార లేమి అనేది బాలికలతో పోలిస్తే బాలురలోనే ఎక్కువగా ఉండటం గమనార్హం.

నగరాల్లోని పురుషుల్లో 22 శాతం మందికి మధుమేహం సమస్య ఉంటే, మహిళల్లో 19 శాతం మంది ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.బిడ్డ పుట్టన తరువాత తల్లిపాలని ఇచ్చేవారు మాత్రం 42శాతం మంది ఉన్నారని.

అయితే మిగిలిన వారు తల్లిపాలకంటే గ్లూకోజ్, చక్కెర నీరు, మేకపాలు వంటివి పడుతున్నారట.అధిక రక్త పోటు వచ్చిన వాళ్ళు పురుషులలో ఎక్కువ మంది ఉన్నారట.

స్త్రీలలో మాత్రం ఈ శాతం 26 గా ఉందట .అయితే అత్యధికంగా కేరళలో ఈ రక్తపోటు సమస్యవల్ల బాధపడేవాళ్ళు ఉంటే అత్యల్పంగా బీహార్ రాష్ట్రం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube