మెగా హీరోయిన్ నిహారిక హీరోయిన్ గా అరంగేట్రం చెయ్యబోతున్న ‘ఒక మనసు’ సినిమా విడుదల కి సిద్దం అవుతూ ఉండడం తో మెగా ఫాన్స్ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.ఈ వారంతం లో రాబోతున్న ఈ సినిమా నిహారిక ని హీరోయిన్ గా నిలబెట్టాలి అని కోరుకుంటారు అందరూ.
ముఖ్యంగా గ్లామర్ రోల్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా ఒక హోమ్లీ పాత్ర ఆమె చెయ్యడం వారికి నచ్చింది.చాలా తక్కువ టైం లో యాంకర్ నుంచి హోస్ట్ గా అటు నుంచి షార్ట్ ఫిలిం లలో చేస్తూ ఎదిగిన నిహారిక తన కెరీర్ ని చాలా తక్కువ సమయం లో ప్లాన్ చేసుకుంటూ సాగుతోంది.
హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అవ్వడం ఆమె తక్షణ కర్త్యవ్హం గా భావిస్తోంది ఆమె.ఇక ఒక మనసు సినిమా ఏమైనా తేడా కొడితే ఏంటి పరిస్థితి అనే ఆలోచన కూడా నిహారిక కి ఉండనే ఉంది.
మరి హీరోయిన్ కాకపోతే నీ టార్గెట్ ఏమయ్యేది? అనే ప్రశ్న ఒక మనసు ప్రమోషన్స్ లో ఉన్న నీహారికకు ఎదురైంది.దీనికి ఈ చిన్నది ఇచ్చిన ఆన్సర్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
తన తండ్రి స్టార్ట్ చేసిన అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ ను హ్యాండిల్ చేసే దాన్ని అంటూ ఆన్సర్ ఇచ్చింది నీహారిక.ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చాలానే బ్యానర్స్ ఉన్నాయి.
కానీ గతంలో అల్లు అరవింద్ నిర్మాతగా సక్సెస్ అయినట్లుగా.వేరెవరూ విజయం సాధించలేదు.