మెగా మూవీలో నిహారిక కూడా..!

మెగాస్టార్ 150వ సినిమాగా తెరకెక్కుతున్న ఖైది నెంబర్ 150వ సినిమా సగానికిపైగా షూటింగ్ జరిగింది.9 ఏళ్ల పాటు గ్యాప్ తీసుకున్న చిరు ఆ గ్యాప్ ను ఏమాత్రం కనిపించకుండా తనలోని గ్రేస్ చూపించేందుకు చాలా కష్టపడుతున్నడు.ఇక హీరోయిన్ గా కాజల్ ఈమధ్యనే షూటింగ్ లో జాయిన్ అయ్యింది.అయితే ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ కూడా ఉండబోతుందట.అది ఎవరో కాదు మెగా డాటర్ నిహారిక.మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సినిమా ఫ్లాప్ అయినా మంచి క్రేజ్ సంపాదించింది.

 Niharika Cameo In Megastar 150-TeluguStop.com

పెదనాన్న సినిమాలో ఏ చిన్న రోల్ అయినా చాలు చేసేస్తా అని చెప్పిన నిహారికకు ఇప్పుడు నిజంగానే ఓ ప్రత్యేకమైన రోల్ ఇచ్చాడట వినాయక్.ఎలాగు ఓన్ ప్రొడక్షనే కాబట్టి ఇబ్బంది కూడా ఉండదు.

సో మెగా మూవీలో మెగా డాటర్ సర్ ప్రైజ్ ఇస్తుందన్నమాట.ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న చిరు మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అభిమానులు మళ్లీ ఒకప్పటి మెగాస్టార్ ను చూస్తారంటూ వినాయక్ సినిమా మీద అంచనాలను పెంచేస్తుండటం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube