వెబ్ సీరీస్ మోజులో నిహారిక..!

మెగా డాటర్ గా ఒక మనసు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఓ పెద్ద ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా వచ్చి అందరికి షాక్ ఇచ్చింది.అయితే మొదటి సినిమా ఫలితం జీర్ణించుకోలేని నిహారిక కాస్త ఎక్కువ బాధపడ్డట్టు తెలిసిందే.

 Niharika Again Doing A Web Series-TeluguStop.com

సినిమా చేయడానికి ముందే ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సీరీస్ తో ఫేమస్ అయిన నిహారిక ఆ సీరీస్ లో తన నటనకు మంచి మార్కులే సంపాదించింది.ఇక ఆ తర్వాత ఈటివి ఢీ జూనియర్స్ తో యాంకర్ గా కూడా అవతారమెత్తేసింది.

ఇక ఇన్ని చేసినా మొదటి సినిమా ఫలితం నిరాశ పరచడంతో నిహారిక మళ్లీ ఓ వెబ్ సీరీస్ చేయాలని ఆరాటపడుతుందట.ఓ సినిమాలో హీరోయిన్ గా నటించి మళ్లీ వెబ్ సీరీస్ లో నటిస్తే అంత క్రేజ్ ఉండదని మెగా బ్రదర్ నాగబాబు సలహా ఇస్తున్నా అవేవి పట్టించుకోకుండా మళ్లీ ముద్దపప్పు ఆవకాయ్ లానే మరో వెబ్ సీరీస్ ను స్టార్ట్ చేయబోతుందట నిహారిక.

మరి వెబ్ సీరీస్ మోజులో ఉన్న నిహారిక తీసుకున్న డెశిషన్ కరెక్టా కాదా అన్నది త్వరలో తెలుస్తుంది.ఇక ఓ పక్క తన రెండో సినిమా కథా చర్చల్లో కూడా నిమ్మగ్నమై ఉందట నిహారిక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube