సక్సెస్‌ దర్శకుడికి ఆఫర్లేవి?

షార్ట్‌ ఫిల్మ్స్‌తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకుని ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న దర్శకుడు విరించి వర్మ.ఈ యువ దర్శకుడు మొదటి సినిమాతో సక్సెస్‌ సాధించినా రెండవ సినిమా చేసేందుకు మాత్రం చాలా గ్యాప్‌ తీసుకున్నాడు.

 Next: Nani Hero Role In Virinchi Varma Movie?-TeluguStop.com

ఈయన పలు కథలను సిద్దం చేసినా కూడా అవేవి నిర్మాతలకు నచ్చలేదని, ఈయనతో వర్క్‌ చేసేందుకు హీరోలు పెద్దగా ఆసక్తి చూపలేదు.అయినా పట్టు వదలని విక్రమార్కుడిగా పలు కథలను రాసుకున్న వర్మ చివరకు నానిని తన కథతో ఒప్పించినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

తాజాగా ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రంతో మంచి జోష్‌ మీదున్న నాని, అదే జోష్‌తో ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఆ సినిమాకు ‘జై బాలయ్య’ అనే టైటిల్‌ను పెట్టే అవకాశాలున్నాయి.

మరో వైపు తనను హీరోగా పరిచయం చేసిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత ‘ఉయ్యాలా జంపాలా’ ఫేం విరించి వర్మ దర్శకత్వంలో ఈయన నటించే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఒక క్యూట్‌ లవ్‌ స్టోరీని నానితో వర్మ తెరకెక్కించబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube