కొత్త ట్రాఫిక్ పెనాల్టిల లిస్టు .. చదివి జాగ్రత్తగా ఉండండి

ఈరోజు నుంచి ట్రాఫిక్ పోలీసు చాలా స్ట్రిక్ట్ గా మారనున్నాడు.తెలంగాణ రాష్ట్రం మొత్తం ట్రాఫిక్ విధివిధానాలు మారుతున్నాయో లేదో కాని, హైదరబాద్ వరకు మాత్రం కొత్తగా పాయింట్స్ సిస్టం తీసుకొచ్చారు.

 New Penalty Chart For Ignoring Traffic Rules-TeluguStop.com

ఈరోజు నుంచే ఈ పాయింట్ సిస్టం అమలు.ఇకనుంచి హెల్మెట్ లేకుండా దొరికితే వంద చేతికిచ్చి వెళ్ళడం కుదరదేమో, యూ టర్న్ కోసం అరకిలోమీటరు ఎవడు వెళతాడు అంటూ రాంగ్ రూట్ లో వెళ్ళడం అస్సలు కుదరదేమో.

లైసెన్స్ లేకుండా నగరంలో తిరగడం దాదాపుగా ఆసాధ్యం ఏమో.ఎందుకంటే ఇకనుంచి ప్రజలే ఒళ్ళు దగ్గర పెట్టుకోని వాహానాలు నడుపుతారు.రూల్స్ అతిక్రమిస్తే వారికే నష్టం.మీరే చూడండి .ఈ పాయింట్స్ ఏంటో.ఆ పాయింట్స్ వలన దొరికే పనిష్మెంట్ ఏంటో.

* హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ లేకపోతే = 1 పాయింట్

* అతి వేగం మరియు రాంగ్ రూట్ మీద నడపటం = 2 పాయింట్స్

* ఇన్సురెన్స్ లేకుండా బండి నడపడం = 2 పాయింట్స్

* మద్యం సేవించి నడపడం (ద్విచక్ర) = 3 పాయింట్స్

* మద్యం సేవించి నడపడం (మూడు/నాలుగు చక్రాలు) = 4 పాయింట్స్

* గవర్నమెంటు వాహనాన్ని తాగి నడపడం = 5 పాయింట్స్

* పోలుషన్ సర్టిఫికేట్ లేకపోవడం లేదా హైవే రోడ్డు మీద పార్క్ చేయడం = 2 పాయింట్స్

* గూడ్స్ బండిలో అనుమతి లేని ప్రయాణికులని తీసుకెళ్లడం = 2 పాయింట్స్

* IPC Sections 279, 336, 337, 338 = 2 పాయింట్స్

* IPC sections 304 (I), 304 (II) = 5 పాయింట్స్

* డ్రైవింగ్ చేస్తూ చైన్ దొంగలించడం = 5 పాయింట్స్

కేవలం పాయింట్స్ వేసి వదిలేస్తారు అనుకుంటే అది మీ భ్రమే.పాయింట్స్ జమ చేసుకుంటే ఏమవుతుందో చూడండి

* మొదటిసారి 12 పాయింట్స్ జమ అయితే ఓ సంవత్సరం పాటు లైసెన్స్ సస్పెండ్ చేసేస్తారు

* రెండోవసారి 12 పాయింట్స్ జమ చేసుకుంటే రెండేళ్ళ పాటు లైసెన్సస్ సస్పెన్షన్ తో పాటు, లర్నర్స్ లైన్సేస్ క్యాన్సల్ చేసి, అదనంగా 5 పాయింట్స్ వేస్తారు

* మూడోవసారి 12 పాయింట్స్ జమ అయితే ఏకంగా మూడేళ్ళపాటు లైసెన్స్ సస్పెండ్ చేసేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube