Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

పోర్న్ చూస్తున్నారా ? అయితే మీ ఫేస్ బుక్ ఎకౌంట్ జాగ్రత్త -Never Watch Porn Without Logging Out Facebook .. Know Why?

రెండు మూడు ట్యాబ్స్ లో బ్రౌజింగ్ చేయడం మనం ఎప్పుడూ చేసేదే. అలాగే, ఫేస్ బుక్ ఒక ట్యాబ్ లో ఓపెన్ చేసిపెట్టి, మరో ట్యాబ్ లో మరో పని కానివ్వడం కూడా చాలామంది చేసేది. అయితే, ఈ అలవాటు ప్రమాదకరం. మీ ఫేస్ బుక్ ఎకౌంట్, అందులోని పర్సనల్ డేటా, మొత్తం ప్రమాదంలో పడొచ్చు. ముఖ్యంగా ఫేస్ బుక్ ఓపెన్ చేసిపెట్టి, పోర్న్ చూస్తే. అలా ఎలా అవుతుంది .. ఇందులో లాజిక్ లేదు అని మీరు పొరబడవచ్చు.

ఫేస్ బుక్ లో లాగిన్ అయి ఉండి, పోర్న్ వెబ్ సైట్స్ లోకి వెళ్ళారు అనుకోండి, ఆ వెబ్ సైట్ల ఫేస్ బుక్ ప్లగిన్స్ మీ బ్రౌజింగ్ ని ట్రాక్ చేస్తాయి. Porn based Malware ఇప్పుడు చాలామంది ఫేస్ బుక్ ఎకౌంట్ల మీద దాడి చేస్తున్నాయి. మీరు ఓ విడియో ప్లే చేస్తారు .. అది సగం మాత్రమే ప్లే అయ్యి, మిగితా వీడియో చూడాలంటే లాగిన్ అవమని అడుగుతుంది సైట్, మీరు ఫేస్ బుక్ తో లాగిన్ అవగానే మీ ఫేస్ బుక్ డేటా అంతా ఆ పోర్న్ సైట్ దగ్గరికి వెళ్ళిపోతుంది.

మీకు తెలియకుండానే మీ ఫేస్ బుక్ ఎకౌంట్లో పోర్న్ పోస్టులు పడవచ్చు. మీకు తెలియకుండానే మీరు మీ మిత్రులకి ఏదైనా పోర్న్ విడియో లింక్ పెట్టేస్తారు. ఇదంతా మీరే చేస్తున్నారేమో అని మీ స్నేహితులు పొరబడతారు. మీ ఫేస్ బుక్ వాల్ మీద, మీ నుంచి వచ్చే సందేశాల్లో అశ్లీల కంటెంట్ ఉంటే మీకు ఎంత చెడ్డపేరు? అందులోనూ అబ్బాయి అకౌంట్ నుంచి అమ్మాయికి, అమ్మాయి అకౌంట్ నుంచి అబ్బాయికి అలాంటి మెసెజ్ వెళితే జరిగే పరిణామాలేంటో మీ ఊహకే వదిలేస్తున్నాం.

కెనెడాలో ఇలానే ఓ అమ్మాయి ప్రొఫైల్ నుంచి తన బాస్ ఫేస్ బుక్ ఎకౌంట్ కి మాల్వేర్ లింక్స్ వెళ్ళాయట. అది ఆయన క్లిక్ చేయడం, ఆయన ఎకౌంట్ కూడా హ్యాక్ అవడం, ఈ చెత్త నాకు అంటించింది నువ్వే అంటూ, ఆయన ఆ అమ్మాయిని జాబ్ లోంచి తీసెయ్యడం జరిగాయి. మరి మీరు మాత్రం రిస్కి పనులు చేయడం ఎందుకు?

ఇదంతా ఫేస్ బుక్ ఎకౌంట్ తో పోర్న్ వెబ్ సైట్లోకి లాగిన్ అయితే కదా జరిగేది, లేదంటే ఎలాంటి ప్రమాదం లేదు కదా అని అనుకోకండి, మీరు ఫేస్ బుక్ లాగిన్ అయి ఉన్న మొబైల్ లేదా కంప్యూటర్ నుంచి పోర్న్ చూస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని హ్యాక్ చేయగల పోర్న్ సైట్లు ఉన్నాయి. అందుకే ఎప్పుడూ, ఫేస్ బుక్ నుంచి లాగౌట్ అయిన తరువాతే అలాంటి సైట్లని బ్రౌజ్ చేయండి. లేదంటే ప్రైవేట్ విండో వాడండి. మీ బ్రౌజింగ్ డేటా, మీ పర్సనల్ డీటేల్స్, మీ ఫేస్ బుక్ అకౌంట్ .. మరొకరి చేతిలో పెట్టకండి.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts
To Top