ఈ ఆహారాల్ని మళ్ళీ వేడి చేసి తినొద్దు.. ప్రమాదం

చాలావరకు ఆహారపధార్థాలను వేడిగా ఉన్నప్పుడు తినటంలో ఉన్న మజా వేరు.మరి చల్లబడ్డాక మళ్ళీ దాన్నే తినాలంటే ఎలా? ఇలాంటి చిక్కుముడికే మనవాళ్ళు మళ్ళీ వేడిచేయడం అనే ఉపయాన్ని కనిపెట్టారు.కాని ఆహార పదార్థాలను రెండొవసారి ఉడకబెట్టకూడదని అంటారు.మరీ ముఖ్యంగా ఈ క్రింది ఆహార పదార్థాలను రెండొవసారి అస్సలు ఉడకబెట్టొద్దు.

 Never Reheat These Foods Again Details, Foods, Double Heating, Mushrooms, Chicke-TeluguStop.com

* పాలకూర మామూలుగా ఒకసారి ఉడకబెట్టి తింటే ఎంత ఆరోగ్యకరమో, రెండొవసారి ఉడకబెట్టి తింటే అంతకంటే ఎక్కువ ప్రమాదకరం.క్యాన్సర్ సెల్స్ పెరిగేందుకు కూడా తిరిగి వేడి చేసిన పాలకూర కారణం కావచ్చు.

* చికెన్ లో లభించే ప్రోటీన్లు మనకు ఎంత మేలు చేస్తాయో చెప్పనవసరం లేదు.కాని తిరిగి వేడి చేయడం ద్వారా ఆ ప్రోటిన్లు తమ సారాన్ని కోల్పోయి, జీర్ణ సమస్యలు తీసుకొస్తాయి.

* గుడ్లను కూడా ఒకేసారి ఉడకబెట్టుకోని తినాలు.వాటిని మరోసారి వేడిచేయడం ఏమాత్రం మంచిది కాదు.

అలా కాకుండా ఫ్రై చేసుకున్నా సరే, మళ్ళీ వేడి చేయకూడదు.

* ఆలుగడ్డని మళ్ళీ వేడి చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రింట్స్ అన్ని వెళ్ళిపోతాయి.

దాంతో మీరు బరువు పెరగటానికి కాలరీలు తప్ప ఇంకేమి తీసుకున్న లెక్కలోకి రాదు.మళ్ళీ వేడి చేసిన ఆలుగడ్డలు హానికరం.

* మష్రూమ్స్ ని కూడా మాటిమాటికి వేడి చేయకూడదు.ఇలా చేస్తే అజీర్ణ సమస్యలే కాదు, గుండె సంబంధిత వ్యాధుల కూడా వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube