అలాంటివి సోషల్ మీడియాలో పెట్టకపోతేనే మంచిది

ఒక తెలుగు సినిమా డైరెక్టర్ కి(పేరు అప్రస్తుతం) కులం పిచ్చి ఎక్కువ.తన కులవర్గానికి చెందిన ఓ హీరో అంటే ఆయనకి అభిమానం.

 Never Inbox Or Post Any Negative Thing On Social Media-TeluguStop.com

ఆ అభిమాన హీరోకి మరో హీరో అంటే పడదు.కాబట్టి ఈ డైరెక్టర్ కి కూడా ఆ హీరో అంటే పడదు.

వీలు చిక్కనప్పుడల్లా, తన అభిమాన హీరోని వెనకేసుకు వచ్చి, మరో హీరోని మాత్రం నొటికొచ్చిన బూతులు తిట్టేవాడు.కాని ఈ విషయం బయటి ప్రపంచంలో ఎవరికి తెలియదు.

కాని ఓరోజు తప్పతాగి సోషల్ మీడియాలో ఆ హీరోని నొటికొచ్చిన బూతులు తిట్టాడు.దాంతో విషయం చాలామందికి తెలిసిపోయింది.

ఏం లాభం … ఊరికే పరువు పోగొట్టుకున్నాడు.

అమెరికాలో ఓ సాప్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగస్తుడు తనతోనే ఆఫీసులో పనిచేసే ఓ స్నేహితుడుతో కలిసి ఎప్పుడూ బాస్ ని తిట్టేవాడట.

వారిద్దరూ ప్రైవేటుగా ఎన్ని బూతులు తిట్టుకున్నా, ఎవరికి తెలుస్తుంది.ఓరోజు ఇద్దరు ఫేస్ బుక్ లో చాట్ చేస్తూ, అక్కడ కూడా బాస్ మీద బూతులు కక్కారంట.

కొన్నిరోజుల తరువాత ఆ ఇద్దరిలో ఒకడు, ఆఫీసులోని ఓ కంప్యూటర్‌ లో ఫేస్ బుక్ ఓపెన్ చేసి, మళ్ళీ లగౌట్ చేయడం మర్చిపోయాడు.అనుకోకుండా బాస్ ఆ కంప్యూటర్ ని చూడటం, ఆ తరువాత ఫేస్ బుక్ ఓపెన్ చేసి ఇద్దరు స్నేహితుల మధ్య కబుర్లు చూడటం, తన మీద వాళ్లిద్దరూ వేసే జోకులు, బూతులు అన్ని చూసి, ఇద్దరి ఉద్యోగాలు పీకేసాడు.

ఇంతే కాదు, రాజకీయ నాయకుల మీద విమర్శలు చేసి జైలుకి వెళ్ళిన సంఘటనలు కూడా ఉన్నాయి.అందుకే సోషల్ మీడియాలో అందరి గురించి బాగా మాట్లాడండి.

మీకు సదరు వ్యక్తి మీద మంచి అభిప్రాయం ఉన్నా లేకున్నా పాజిటివ్ కామెంట్స్ మాత్రమే పాస్ చేయండి.పోస్టు పెడితే, కొంతమంది చూసారని డిలీట్ చేస్తారేమో .కాని ఇలా మెసెజుల్లో విమర్శలు చేస్తే పెద్ద తలనొప్పే.మీరు పంపిన సందేశాలు బయటకి లీక్ చేస్తానని బ్లాక్ మేయిల్ కూడా చేయొచ్చు.

ఇలాంటి సంఘటనలు జరిగాయి కూడా.కాబట్టి సోషల్ మీడియా వరకైనా, రాముడు .మంచి బాలుడు లాగానే ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube