” ఆ ఛానల్ కి తప్ప ప్రపంచం లో అందరికీ నేను నా శైలజ బాగా నచ్చింది, వారి ఇబ్బంది ఏంటో నాకు అర్ధం కావట్లేదు ” అంటూ టీవీ 5 ఛానల్ మీద హీరో రాం పోతినేని చేసిన తీవ్ర వ్యాఖ్యల సంగతి తెలిసిందే.అతను చేసిన ట్వీట్ లు చాలా తక్కువ సమయంలో పెద్ద సంచలనం సృష్టించాయి.
ఆ ఛానల్ ని ఉద్దేశించి పరోక్షంగా సటైర్ వేసిన రాం కి మద్దతు గా ఆ ఛానెల్లో పని చేస్తున్న నవీన్ అనే ఎంప్లాయ్ ‘నేను శైలజ’ మీద ఇచ్చిన రివ్యూను వ్యతిరేకిస్తూ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడాడట.దీంతో ఛానెల్ యాజమాన్యం అతణ్ని ఉద్యోగం నుంచి తీసేసింది.
ఈ సంగతి రాం స్వయంగా ట్విట్టర్ లో మాట్లాడాడు.
నవీన్ అనే ఒక అభిమాని ఆ ఛానల్ లో పనిచేస్తున్నాడు, అతను టీవీ 5 వారితో ఆ సినిమా బాగుంది అని అనడం తో వారు అతన్ని ఉద్యోగం లోంచి తీసేశారు.
‘‘ఈ సొసైటీ ఎటు పోతోందో నాకర్థం కావడం లేదు.నేను శైలజ రివ్యూ మీద వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆ ఛానెల్ నవీన్ అనే ఉద్యోగిని తప్పించిందట.
అతను నా ఫ్యాన్ అని కూడా తెలిసింది.ఆ ఛానెల్ నిర్ణయాన్ని గౌరవిస్తా.
అందులో లాజిక్ ఉంది.కానీ ఫ్యాన్స్ విషయానికి వస్తే లాజిక్కుల గురించి ఆలోచించను.
నవీన్ కు నా సారీ.అతను మరో జాబ్ లో చేరే వరకు నా ఆఫీస్ కు వచ్చి ప్రతి నెలా జీతం తీసుకోవచ్చు’ అని చెప్పాడు రాం.