రామ్ చరణ్ ని టార్గెట్ చేసిన రామ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఓవర్సీస్ మార్కెట్ చాలా తక్కువ అనే విషయం తెలిసిందే.చరణ్ కి రికార్డులు చాలా దూరం కాని, ఓ లెక్కన చెప్పుకోవడానికి బాగా కలెక్ట్ చేసిన సినిమా ఒక్కటి లేదు అక్కడ.

 Nenu Sailaja Nearing Ram Charan Highest In Usa-TeluguStop.com

కారణాలు ఏవైనా, చరణ్ కి ఓవర్సీస్ మార్కెట్ అనేది అందని ద్రాక్ష.

బ్రూస్ లీ రికార్డు లెవెల్లో రిలీజ్ చేసినా ఏమాత్రం లేకుండా పోయింది, ఓవర్సీస్ డిస్ట్రిబ్యుటర్స్ ఘోరంగా నష్టపోయారు.

నాని లాంటి చిన్న హీరో కుడా భలే భలే మొగాడివోయ్ చిత్రంతో 1 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసాడు.కాని చరణ్ సినిమా ఒక్కటి కుడా ఇంతవరకు మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయలేదు.

అక్కడ రామ్ చరణ్ హయ్యెస్ట్ 6 లక్షల 69 వేల డాలర్లు మాత్రమే.

నాని తరువాత యంగ్ హీరో రామ్ కుడా రామ్ చరణ్ ని టార్గెట్ చేస్తున్నాడు.

రామ్ కొత్త చిత్రం నేను శైలజా నిన్నటికి 6 లక్షల 10 వేల డాలర్లు కలెక్ట్ చేసింది.అక్కడి బయ్యర్లంతా భారి లాభాలు వెనకేసుకున్నారు.

మరో 60 వేల డాలర్లు కలెక్ట్ చేస్తే రామ్ కుడా అక్కడ రామ్ చరణ్ ని దాటేసినట్టే.చరణ్ ఫ్యాన్స్ కి ఇది నిజంగా మింగుడుపడని విషయం.

తని ఒరువన్ రీమేక్ తో అయినా చరణ్ ఓవర్సీస్ మార్కెట్ లో తన సత్తా ఛాటుతాడని, తన అభిమానుల ఆశలు ఫలిస్తాయని ఆశిద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube