రామ్ చరణ్ సరసన చిరుతలో తెరంగ్రేటం చేసిన నేహా శర్మ గుర్తుందిగా.ఎలా మరచిపోతారు లేండి అంత అందాన్ని.
ఆ తరువాత కూడా కొన్ని తెలుగు సినిమాలు చేసింది కాని, ఏ ఒక్క సినిమా కూడా పేరు తీసుకురాలేదు.అటు బాలివుడ్ లోనూ అంతే, రెండుమూడు క్రేజీ ప్రాజెక్ట్స్ చేసినా, సక్సెస్ లేక అక్కడ కూడా కెరీర్ ఫ్లాప్ అయిపోయింది.
అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్ళ మతులు పోగోట్టే ఈ భామ కొత్తగా తుమ్ బిన్ 2 అనే హిందీ సినిమా చేసింది.
ఈ సినిమా కోసమే గర్భవతిగా మారింది నేహా.
అంటే నిజంగా కాదు, సినిమా కోసమే.నిజానికి నేహా గర్భవతిగా కనిపించే సన్నివేశాలు ఒకటిరెండు రోజుల్లో పూర్తి చేద్దాం అనుకున్నారట.
కాని దురదృష్టవశాత్తు ఆ సన్నివేశం ఎప్పుడూ సరిగా వచ్చేది కాదట.దాంతో ఆ సన్నివేశాలు అనుకున్నట్టుగానే రావడానికి 41 రోజులు పట్టాయట.
అలా 41 రోజులపాటు కృతిమంగా తన కడుపుకి కట్టిన భారీ బరువుని మోసిందట నేహ.అంత బరువు ఎందుకు అంటే, నిజంగా బిడ్డ బరువు మోసినట్టుగా అనిపించి, సన్నివేశం సహజంగా రావడానికి అంట.మొత్తానికి అన్నిరోజుల తరువాత సన్నివేశం కరెక్టుగా వచ్చేసరికి ఊపిరి పీల్చుకుందట.చాలా బరువుగా ఉండేదని, ఎన్నో అవస్థలు పడ్డానని చెప్పుకొచ్చింది నేహా.
మరి నవంబరు 18న విడుదల అవుతున్న ఈ సినిమా తన కష్టానికి తగ్గ ఫలితాన్ని తీసుకువస్తుందో లేదో చూడాలి.