బాహుబలిపై పెదవి విరుపు-Negative Response For Baahubali 2 First Look 1 month

Dubbing Poster Negative Response For Baahubali 2 First Look Prabhas Birthday Rajamouli Photo,Image,Pics-

ప్రాంతాలు, భాషలతో సంబంధం లేకుండా యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న సినిమా బాహుబలి. తొలిభాగం అంచనాలకి మించి బాక్సాఫీస్ సక్సెస్ ని సొంతం చేసుకోవడంతో రెండొవభాగంపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచేందుకు నిన్న ప్రభాస్ పుట్టినరోజుని పురస్కరించుకోని బాహుబలి యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, వారి ప్లాన్ పెద్దగా ఫలితానివ్వలేదు.

టాలివుడ్, బాలివుడ్, కోలివుడ్ అని సంబంధం లేకుండా, ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి అధికశాతం మంది పెదవి విరిచారు. అంచనాలకు అందుకోలేకపోయింది పోస్టర్. ఎవరో ఫోటోషాప్ తొలిసారి చేస్తున్నవారు డిజైన్ చేసినట్టుగా, ఏదో డబ్బింగ్ సినిమా పోస్టర్ లా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. సో, ఆరకంగా బాహుబలి 2 ప్రమోషన్స్ లో వేసిన తొలి అడుగు బెడిసికొట్టింది.

మరి బాహుబలి టీజర్ తో అయినా, లేక మరికొన్ని పోస్టర్స్ విడుదల చేసైనా, మన జక్కన్న ఉన్న ఊపుని ఎలా పెంచుతాడో, డిజాపాయింట్ అయిన బాహుబలి అభిమానులని ఎలా సంతోషపెడతాడో చూడాలి.


About This Post..బాహుబలిపై పెదవి విరుపు

This Post provides detail information about బాహుబలిపై పెదవి విరుపు was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Negative response for Baahubali 2 first look, Baahubali 2 first look, Prabhas, Rajamouli, Dubbing Poster, Prabhas birthday

Tagged with:Negative response for Baahubali 2 first look, Baahubali 2 first look, Prabhas, Rajamouli, Dubbing Poster, Prabhas birthdayBaahubali 2 first look,Dubbing Poster,Negative response for Baahubali 2 first look,prabhas,prabhas birthday,rajamouli,,