మహేష్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ గా అభిమన్యుడు అని పెట్టబోతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.అయితే అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు కాని అదే టైటిల్ ఫిక్స్ అంటున్నారు.
ఈ టైటిల్ పట్ల సూపర్ స్టార్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.ఎయిటీస్ లో శోభన్ బాబు అభిమన్యుడు టైటిల్ తో ఓ సినిమా వచ్చింది.
ఇక కళ్యాణ్ రాం కూడా అభిమన్యు అంటూ ఓ ఫ్లాప్ సినిమా తీశాడు
ఈ ఫ్లాప్ సెంటిమెంట్ ను బలంగా నమ్ముతున్న మహేష్ అభిమానులు అభిమన్యుడు టైటిల్ వద్దే వద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటికే బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో తన జోరుకి బ్రేకులు పడ్డాయని బాధ పడుతున్న మహేష్ మురుగదాస్ సినిమా టైటిల్ పట్ల ఇలా నెగటివ్ రీమార్క్స్ రావడం తలనొప్పిగా భావిస్తున్నాడు.
అసలు టైటిల్ అదా కాదా అని తెలియక ముందే ఎటాక్ చేసిన ఫ్యాన్స్ మాట విని టైటిల్ రేసులో అభిమన్యుడు ని డిలీట్ చేస్తాడా లేక ఫ్యాన్స్ ఏలా అనుకుంటే నాకేం అని అదే టైటిల్ కమిట్ అవుతాడా అన్నది తెలియాల్సి ఉంది.