ఇక మీరు ఆధార్ కార్డు మోయనక్కరలేదు .. ఈ యాప్ వాడండి

ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు అడుగుతున్నారు.ప్రతి విషయానికి ఆధార్ ని లింక్ చేస్తున్నారు.

 Need To Carry Aadhar Card With You .. Use This App-TeluguStop.com

ఆధార్ లేకుండా ఏ ప్రభుత్వ పని కూడా పూర్తయ్యే అవకాశాలు ఇకపై ఉండవు.కానీ ప్రతి పనికి ఆధార్ కార్డుని వెంటతీసుకుపోవడం అనేది కష్టమే.

పర్స్ ఎప్పుడు ఆధార్ పెట్టుకునే అలవాటు కొందరికి ఉంటుంది, కొందరేమో కార్డు పొతే మళ్ళీ తీసుకోవాలి అని వెంటబెట్టుకొని వెళ్ళరు.ప్రజలకి ఆ ఇబ్బంది ఎందుకు అనే ప్రభుత్వం ఒక మొబైల్ యాప్ లాంచ్ చేసింది.

దాని పేరే mAadhar.దీన్ని మీరు ఉపయోగించుకోవాలంటే ఒకటే కండీషన్, మీ మొబైల్ నంబర్ ని ముందే UNIQUE IDENTIFICATION AUTHORITY OF INDIA వద్ద రిజిస్టర్ చేయించు ఉండాలి.అలా లేకపోతె ఇప్పుడు చేయించుకోండి.సింపుల్ గా చెప్పాలంటే మీ ఆధార్ వివరాలకి ఫోన్ నంబర్ కూడా జతచేసి ఉంచాలి.

ప్లే స్టోర్ లోంచి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న తరువాత మీ నంబర్ ఎంటర్ చేసి మీ వివరాల కాపీని తీసుకోండి.ఇక ఎక్కడికి వెళ్ళినా మీ మొబైల్ ద్వారానే ప్రూఫ్స్ చూపించవచ్చు.

అంతే కాదు మీ బయోమెట్రిక్ డేటాని లాక్ చేసుకోవడం లేదా అన్ లాక్ చేసుకోవడం .ఇలాంటి వెసులుబాటు కూడా ఉంటుంది.కొత్తగా ఇదేంటి … దీనితో అవసరం ఏమిటి అని అడుగుతున్నారా ? మీరు షాక్ కి గురవుతారు ఏమో కాని, మీరు ఆధార్ కోసం ఇచ్చిన వెలిముద్రలు లేదా బయోమెట్రిక్ నిజానికి అంత సురక్షితం కాదు.మొబైల్ కంపెనీలే సిమ్ ఇస్తున్నప్పుడు మీ బయో’మెట్రిక్ వివరాలు చూడగలుగుతోంది.

కాబట్టి అవి ప్రైవెసిలో ఉండవు.మరి ఎవరైనా మీ వేలిముద్ర వివరాలను దుర్వినియోగిస్తే ? అప్పుడు ఏంటి పరిస్థితి ? ఆల్రేడి ఇలాంటి సంఘటనలు జరిగాయి.అందుకే ఆ సమాచారం కేవలం మీ మధ్య, ప్రభుత్వం మధ్య ఉంచి, అవసరం ఉన్నప్పుడు మాత్రమే తాళం తీసే అవకాశాన్ని యాప్ ద్వారా లభించబోతోంది.అయితే ఈ యాప్ ఇంకా పూర్తిగా సిద్ధం కాకపోవడం వలన .ఇప్పుడు మామూలుగా మీరు ఆ వివరాల్ని ఎలా లాక్ చేసుకోవచ్చో చెబుతాం.

UIDAI వెబ్ సైట్ కి వెళ్ళండి.

మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి.నంబర్ తో పాటు అక్కడే ఉండే కోడ్ ఎంటర్ చేసిన తరువాత మీకు Generate OTP అనే ఆప్షన్ కనిపిస్తుంది.

దానిమీద క్లిక్ చేయగానే మీరు ఆధార్ వివరాలలో ఏ ఫోన్ నంబర్ ని అయితే రిజిస్టర్ చేయించారో, ఆ నంబర్ కి One Time Password వస్తుంది.మొబైల్ కి వచ్చిన ఆ పాస్ వర్డ్ ని మీరు సైట్ లో ఎంటర్ చేయగానే, సైట్ ని యాక్సెస్ చేస్తున్నది మీరే అని వెబ్ సైట్ వెరిఫై చేసుకుంటుంది.

ఇప్పుడు మీకు Enable biometric locking అనే ఆప్షన్ కనిపిస్తుంది.అక్కడ Enable మీద నొక్కగానే మీ బియోమెట్రిక్ వివరాలు సురక్షితమవుతాయి.

అంటే తాళం వేయబడుతుంది.అక్కడే ఉన్న Disable ని నొక్కితే మళ్ళీ అన్ లాక్ అవుతాయి వివరాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube