మెడ కండరాలు పెట్టేస్తే....ఈ వ్యాయామాలు చేయండి

తరచుగా మెడ కండరాలు పట్టేయటం,చిన్నపాటి కదలికకే నొప్పి రావటం వంటి సమస్యలకు ముఖ్య కారణం మెడకు సరైన వ్యాయామం లేకపోవటమే.అందుకే రోజుకి ఒకసారి ఇలా చేస్తే సాధారణంగా ఎదురయ్యే మెడ నొప్పి, ఒత్తిడి కారణంగా వచ్చే మెడ నొప్పి నుండి దూరం కావచ్చు.

 Neck Exercises For Neck Pain-TeluguStop.com

నిటారుగా కూర్చొని మెడను రిలాక్స్ గా కిందకు వంచాలి.ఈ దశలో గడ్డం ఛాతికి తగులుతూ ఉంటుంది.ఈ దశ నుంచి మెడను ముందుగా కుడి వైపుకి వంచి వెనక్కు అదే డైరెక్షన్ లో ముందుకు రావాలి.ఈ విధంగా ఆరు సార్లు చేయాలి.

కుర్చీలో నిటారుగా కూర్చొని మెడను కుడి వైపుకు వంచాలి.ఈ దశలో కుడి చెవి భుజాన్ని తాకుతుంది.మెల్లగా పైకి లేపి ఎడమ వైపుకు వంచాలి.ఈ విధంగా 6 సార్లు చేయాలి.

అలాగే వ్యతిరేక దిశలోను చేయాలి.

మెడను (తలను) వలయాకారంగా తిప్పాలి.

ముందు నుంచి ఎడమ,వెనక ,కుడి నుంచి మళ్ళీ ముందుకు రావాలి.ఇలా ఒకసారి క్లాక్ వైజ్ గాను, మరోసారి యాంటీ క్లాక్ వైజ్ గాను చేస్తే ఒక రౌండ్ అయినట్టు.

ఈ విధంగా నాలుగు రౌండ్ లు చేయాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube