వామ్మో!! నయనతార

ఈ కాలంలో హీరోయిన్లు రెండు మూడు సంవత్సరాలు నిలదొక్కుకుంటే అది చాలా గొప్ప విషయం.అలాంటిది పదిహేను ఏళ్లుగా ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా లాక్కోస్తోంది నయనతార.

 Nayanathara Is Restlessly Busy-TeluguStop.com

పట్టుమని పది సినిమాలు చేస్తేనే గొప్పలు పోతారు హీరోయిన్లు.అలాంటిది 60 సినిమాల దగ్గరలో ఉంది నయనతార.

రెమ్యునరేషన్ మూడున్నర కోట్లు అంటారు తమిళ జనాలు.అసలు ఈ జెనరేషన్లో ఇంత మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ నయనతార మాత్రమె.

పెద్దగా ఎక్స్పోజింగ్ చెయ్యట్లేదు ఇప్పుడు, అగ్రహీరోల వెంటపడట్లేదు, రెండు సార్లు ప్రేమ విఫలమయ్యి నిత్యం నెగెటివ్ వార్తల్లోనే ఉంటూ వస్తోంది.అయినా ఇవేవి ఈ అమ్మడు డిమాండ్ తగ్గించట్లేదు.2016 ఎన్ని సినిమాలు చేతిలో పెట్టుకొని తిరుగుతోందో తెలుసా నయనతార.అక్షరాలా 7 సినిమాలు.

అందులో 5 తమిళ సినిమాలు, ఒక మళయాళ సినిమా, మరొకటి తెలుగులో వెంకటేష్ – మారుతి కాంబినేషన్లో చేస్తున్నది.

నిజమేనో, రుమరో కాని మెగాస్టార్ చిరంజీవి – వి.వి.వినాయక్ చిత్రానికి కుడా నయనతార పేరే వినిపిస్తోంది.ఈ ప్రాజెక్ట్ కుడా కొట్టేస్తే ఈ ఏడాది 8 చిత్రాలు బుట్టలో వేసుకున్నట్టు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube