వెంకటేష్ ని కష్టపెడుతున్న నయనతార

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కనిపించిన నయనతారకి ఇప్పటి నయనతారకి చాలా తేడా ఉంది.ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తన పాత్రకి ప్రాముఖ్యం ఉందా లేదా అని చూడకుండా సినిమాలు చేసేసింది నయన్.

 Nayanatara Troubling Babu Bangaram Unit-TeluguStop.com

ఎప్పటినుంచైతే తమిళ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టిందో, అప్పటినుంచి నయనతార దశ తిరిగిపోయింది.ఇప్పుడు హీరో సపోర్ట్ లేకుండా కూడా తమిళంలో ఈ హీరోయిన్ కలెక్షన్లు తెప్పించగలదు.

దక్షిణాదిలో కోటి రూపాయల పారితోషికం అందుకోవడానికి తోటి హీరోయిన్లు తంటాలు పడుతుంటే ఏకంగా మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకొంటోంది నయన్.ఇది చాలు అనుకుంటా నయనతార క్రేజ్ గురించి చెప్పడానికి.

కాని నయన్ క్రేజ్ బాబు బంగారం చిత్రానికి చిక్కులు తెచ్చిపెడుతోంది.తమిళంలో అరడజనుకు పైగా చిత్రాలకు పైగా ఒప్పుకున్న నయనతారను అతికష్టం మీద కోటిన్నరకు తెలుగులో ఒప్పించాడు మారుతి.

అది కూడా డేట్స్ తక్కువ అడగటం వల్ల ఒప్పుకుంది నయన్.ఫిబ్రవరిలో నయనతార డేట్స్ ఉండటంతో ముందు తను లేని సీన్స్ పూర్తీ చేసాడు దర్శకుడు.

ఫిబ్రవరి రానే వచ్చింది.కాని నయనతారే రాలేదు.

ఇచ్చిన డేట్స్ ని బాబు బంగారం చిత్రానికి వాడట్లేదు అమ్మడు.దాంతో ఈ చిత్రం షూటింగ్ లో ఆలస్యం జరుగుతోంది.

ఇదే తంతు కొనసాగితే ఏప్రిల్ లో అనుకున్న సమయానికి చిత్రం రాకవపోవచ్చు, అసలు ఎప్రిల్ లో రానేరాకపోవచ్చు.వెంకటేష్, మారుతిల ముఖాలు చూసైనా నయనతార కాస్త డేట్స్ అడ్జస్ట్ చేస్తే బాబు బంగారంని పూర్తీ చేయొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube