నయనతార వల్ల ఎన్ని కష్టాలో

సౌత్ నెం.1, అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్.ఎన్ని ఉంటే ఏంటి, డిసిప్లిన్ లేకపోతే.ఏరికోరి నయనతారని ఎంచుకున్నాడు దర్శకుడు మారుతి.నడుస్తున్న “బాబు బంగారం” మినహా, మారుతి సినిమాలేవి ఆలస్యంగా పూర్తి కాలేదు.ఈసారి మాత్రం మారుతి ఇమేజ్ కి పుర్తి భిన్నంగా జరుగుతోంది.

 Nayanatara Forces Babu Bangaram Makers To Postpone The Release-TeluguStop.com

ఇప్పుడు నయనతార పేరు చెబితే హీరో వెంకటేష్ కి కూడా ఎక్కడలేని కోపం వస్తోందట.

డేట్స్ ఇచ్చింది, కాని షూటింగ్ కి రాలేదు.

ఆ డేట్స్ అయిపోయాక, ఇప్పుడు నయనతార దగ్గర డేట్స్ లేకుండాపోయాయి ఇవ్వడానికి.ఏప్రిల్ లో విడుదల చేద్దాం అనుకున్న బాబు బంగారం, మే, మే నుంచి జూన్, జూన్ నుంచి జులై 6వ తేదికి వెళ్ళిపోయింది.

నయనతార డేట్స్ లేని కారణంగా ఈ సినిమా జులై 6న కూడా రావడం అనుమానంగా మారింది.

సినిమా ఎప్పుడు పూర్తవుతుందో డైరెక్టర్ మారుతికి కూడా ఒక ఐడియా రావడం లేదట.

దర్శకుడే అలా ఉండటంతో బయ్యర్లకు విపరీతమైన టెన్షన్ పుట్టేస్తోంది.అప్పులు తెచ్చి సినిమా కొంటారు కదా, వడ్డి పెరిగిపోతోందనే భయం వారిది.

చూసావా నయనతార .నీ వల్ల ఇక్కడ ఎంతమందికి ఎన్ని కష్టాలో !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube