నయనతార పవన్ ని అంత మాటనేసిందా?

హాట్ బ్యూటి నయనతారకి తమిళనాట ఉన్న డిమాండ్ గురించి గురించి కొత్తగా చెప్పనవసరం లేదు.అందరు హీరోయిన్లలా కేవలం పాటలకి, గ్లామర్ ఒలకబోయడానికి పరిమితం కాకుండా, అభినయానికి అస్కారం ఉన్న పాత్రలు చేస్తూ, హీరోల సపోర్ట్ లేకుండా లాక్కొస్తూ, “లేడి సూపర్ స్టార్” గా ఎదిగింది నయన్.

 Nayanatara Doesn’t Need Pawan?-TeluguStop.com

అందుకే దక్షిణాదిలో అందరికన్నా ఎక్కువ పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా నిలబడింది ఈ ముద్దుగుమ్మ.

ఇక విషయంలోకి వెళ్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆర్టీ నీసన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఏ.ఎమ్ రత్నం నిర్మించనున్న ఈ సినిమా తమిళ బ్లాక్బస్టర్ వేదాలంకి రీమేక్ అన్న సంగతి విదితమే.అయితే, ఈ చిత్రం కోసం నయనతారని హీరోయిన్ గా అనుకుంటున్నారంట.

కాని నయన్ ఈ సినిమా చేస్తుందా లేదా అనే అనుమానం అందరిలోనూ ఉంది.ఎందుకంటే ఒకప్పటి నయన్ కి ఇప్పటి నయన్ కి చాలా తేడా ఉంది.హీరోల పక్కన డ్యాన్సులు చేస్తూ, అక్కడక్కడ కనబడటం మానేసింది నయన్.

పైగా తన సన్నిహితుల దగ్గర పవన్ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు, ఉంటే గింటే తన అవసరమే పవన్ కి ఉంది తప్ప, పవన్ అవసరం తనకు లేదని నయనతార కామెంట్ చేసిందట.లేడి సూపర్ స్టార్ ఘాటైన కామెంట్ చేసింది కదా!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube