డ్రగ్స్ సరఫరా చేశా అంటున్న నవదీప్ ... నిజాలు వెల్లడి

టాలివుడ్ డ్రగ్స్ కేసులో నిన్న యాక్టర్ నవదీప్ ని విచారించారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు.11 గంటలకు పైగా జరిగింది ఈ విచారణ.మొదటి మూడు నాలుగు గంటలు పెద్దగా జవాబులు ఇవ్వకుండా టైంపాస్ చేసిన నవదీప్, అధికారులు కీలక సాక్ష్యాలతో వచ్చిన తరువాత ముడులన్ని విప్పాడు.తానూ డ్రగ్స్ సరఫరా చేసేది నిజమే అని ఒప్పుకున్నాడు.

 Navdeep Admits His Crime .. He Is A Drug Dealer-TeluguStop.com

నవదీప్ పెద్ద పెద్ద ఈవెంట్స్ నిర్వహిస్తాడు.కేవలం హైదరాబాద్ లోనే కాదు, గోవా, ఊటీ, కొడైకెనాల్, ముంబై, కోల్‌కతా వంటి భారతీయ నగరాల్లో, అలాగే అమెరికా, బ్రెజిల్, బెల్జియం, థాయ్‌లాండ్‌ లాంటి దేశాల్లో ఈవెంట్స్, పార్టీలు నిర్వహించే నవదీప్, ఈ పార్టీలలోనే పెద్దపెద్దవారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు.

నగరంలో ఉన్న అత్యంత ఫేమస్ పబ్బుల్లో ఒకటైన బీపి ఏం పబ్బులో నవదీప్ కి భాగస్వామ్యం ఉంది.పబ్బులే కేంద్రంగా హైదరాబాద్ లో డ్రగ్స్ దందా నడుస్తోంది.

కల్చర్ కి అలవాటు పడిన బడా బాబులు, బడా బాబుల బిడ్డలు పబ్స్ లో లభించే మాదకద్రవ్యాలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తారు.వారు వినియోగించి, స్నేహితులకి అలవాటు చేస్తారు.

చాలామంది సొంతంగా డ్రగ్స్ తెచ్చుకొని పబ్బులో సేవిస్తారు.ఇలాంటి కార్యకలాపాలను నగరంలోని ఎన్నో పబ్బులు అనుమతిస్తున్నాయి.

నగరంలో జరుగుతున్న ఈ డ్రగ్స్ దందా వివరాలు చాలావరకు నవదీప్ బయటపెట్టాడు.తానూ ఎక్కడడెక్కడ డ్రగ్స్ సరఫరా చేసాడో, ఎలాంటి పార్టీలు నిర్వహించాడో, తనకున్న క్లయింట్స్ ఎవరెవరో అన్ని బయటపెట్టేసాడు నవదీప్.

గత ఏడాది నవదీప్ గెస్ట్ హౌస్ లో భారి ఎత్తున మత్తుపదార్థాలు దొరికిన విషయం మీకు గుర్తుకు ఉండే ఉంటుంది.అప్పుడు చాకచక్యంగా తప్పించుకున్న నవదీప్, ఈసారి సిట్ అధికారుల ధాటికి తట్టుకోలేకపోయాడు.

కెల్విన్ మొబైల్ లోని కాల్ లాగ్ లో తన నంబర్ ఉండటం, నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్స్ లో తన మీద ఉన్న కేసులు, డ్రంక్ ఆయిండ్ డ్రైవ్ కేసు, తరచుగా విదేశీ పర్యటనలు, రేవ్ పార్టీల నిర్వహణ .ఇలా వివిధ అంశాలను విచారణలోకి గ్యాప్ ఇవ్వకుండా తీసుకొస్తూ నవదీప్ ని ఉక్కిరిబిక్కిరి చేసారట.దాంతో బయటపడ్డాడు.

అయితే నవదీప్ తన బ్లడ్ సాంపిల్, గోర్లు, వెంట్రుకలు ఇవ్వడానికి నిరాకరించాడు.డ్రగ్స్ సరఫరా చేస్తున్న విషయం బయటపెట్టాడు కాని, తనకి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందొ లేదో, బయటకి వార్త రాలేదు.ఈరోజు ఆర్ట్ డైరెక్టర్ చిన్నాని విచారించనున్నారు అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube