ముక్కు దిబ్బడతో ఇబ్బందిగా ఉందా.. అయితే ఈ పవర్ ఫుల్ చిట్కాలను ఫాలో అయితే సరి

ముక్కు దిబ్బడ అనేది ముక్కు కుహరంలో వాపు మరియు బ్లాక్ కావటం వలన ఏర్పడుతుంది.అలాగే ఫ్లూ, జలుబు మరియు ముక్కు ఇన్ఫెక్షన్ వలన కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది .

 Natural Remedies For Cold Details, Cold, Remedies For Cold, Nose, Nose Infection-TeluguStop.com

ఈ సమస్య ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగాను, చికాకుగాను ఉంటుంది.ఈ ముక్కు దిబ్బడ సమస్యను నివారించటానికి ప్రభావవంతమైన ఇంటి నివారణలు ఉన్నాయి.

ఈ ఇంటి నివారణలు సురక్షితమైనవి మరియు ఆరోగ్యానికి మంచివి.అంతేకాక ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.ఈ నివారణలతో వెంటనే ఉపశమనం కలుగుతుంది.

# ఉప్పు నీరు:

వేడి నీటిలో కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి.ఈ ద్రావణాన్ని ముక్కు యొక్క ఒక బాగంలో డ్రాపర్ సాయంతో వేయాలి.ఈ విధంగా చేయటం వలన ముక్కు రద్దీని క్లియర్ చేయటానికి సహాయపడుతుంది.అంతేకాక ముక్కు దిబ్బడకు కారణమైన ఇన్ఫెక్షన్ మరియు వాపును తగ్గించటంలో ఉప్పు నీరు బాగా సహాయపడుతుంది.

#ఆపిల్ సైడర్ వినెగర్:

ఆపిల్ సైడర్ వినెగర్ ముక్కు దిబ్బడ సమస్యను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.వెనిగర్ లో ఉండే ఆమ్ల స్వభావం సమస్య క్లియర్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది.ఒక గ్లాస్ నీటిలో కొంచెం ఆపిల్ సైడర్ వినెగర్ వేసి కలిపి త్రాగితే మంచి పలితం కనపడుతుంది.

Telugu Applecider, Basil, Ginger, Tips, Honey, Natural, Nose, Salt-Telugu Health

#వెల్లుల్లి:

వెల్లుల్లిని పూర్వ కాలం నుండి ముక్కు దిబ్బడ చికిత్సలో ఉపయోగిస్తున్నారు.వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటివైరల్ లక్షణాలు ముక్కు దిబ్బడ చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.ముక్కులో ఇన్ఫెక్షన్ తొలగించి రద్దీని క్లియర్ చేయటానికి బాగా పనిచేస్తుంది .అందువల్ల వెల్లుల్లి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.సూప్ లో వెల్లుల్లిని వేసుకొని త్రాగితే కూడా మంచి పలితం కనపడుతుంది.

Telugu Applecider, Basil, Ginger, Tips, Honey, Natural, Nose, Salt-Telugu Health

# తులసి:

తులసి ముక్కులోని శ్లేష్మం మరియు బ్లాక్ లను తొలగించటానికి చాలా అద్భుతంగానూ సమర్ధవంతంగానూ పనిచేస్తుంది.కొన్ని తులసి ఆకులను నమలవచ్చు.లేకపోతే తులసి ఆకుల నుండి రసాన్ని తీసి త్రాగవచ్చు.ఇది నాసికా మార్గంను శుభ్రం చేసి ముక్కు దిబ్బడ నుండి ఉపశమనాన్ని కలిగించటంలో చాలా బాగా సహాయపడుతుంది.

#తేనె:

తేనె ముక్కు దిబ్బడ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది .ఈ సమస్య నుండి బయట పడటానికి మరియు తొందరగా నివారించటానికి తేనెలో ఉండే సహజ లక్షణాలుసహాయపడతాయి.ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనే కలిపి త్రాగితే వెంటనే మంచి ఉపశమనం కలుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube