Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ముక్కు దిబ్బడతో ఇబ్బందిగా ఉందా....అయితే ఈ పవర్ ఫుల్ చిట్కాలను ఫాలో అయితే సరి-Natural Remedies For Cold

ముక్కు దిబ్బడ అనేది ముక్కు కుహరంలో వాపు మరియు బ్లాక్ కావటం వలన ఏర్పడుతుంది. అలాగే ఫ్లూ, జలుబు మరియు ముక్కు ఇన్ఫెక్షన్ వలన కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది . ఈ సమస్య ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగాను,చికాకుగాను ఉంటుంది. ఈ ముక్కు దిబ్బడ సమస్యను నివారించటానికి ప్రభావవంతమైన ఇంటి నివారణలు ఉన్నాయి. ఈ ఇంటి నివారణలు సురక్షితమైనవి మరియు ఆరోగ్యానికి మంచివి. అంతేకాక ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ నివారణలతో వెంటనే ఉపశమనం కలుగుతుంది.

వేడి నీటిలో కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ ద్రావణాన్ని ముక్కు యొక్క ఒక బాగంలో డ్రాపర్ సాయంతో వేయాలి. ఈ విధంగా చేయటం వలన ముక్కు రద్దీని క్లియర్ చేయటానికి సహాయపడుతుంది. అంతేకాక ముక్కు దిబ్బడకు కారణమైన ఇన్ఫెక్షన్ మరియు వాపును తగ్గించటంలో ఉప్పు నీరు బాగా సహాయపడుతుంది.

#ఆపిల్ సైడర్ వినెగర్:

ఆపిల్ సైడర్ వినెగర్ ముక్కు దిబ్బడ సమస్యను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెనిగర్ లో ఉండే ఆమ్ల స్వభావం సమస్య క్లియర్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో కొంచెం ఆపిల్ సైడర్ వినెగర్ వేసి కలిపి త్రాగితే మంచి పలితం కనపడుతుంది.

Continue Reading
To Top