మోకాలు నొప్పి తగ్గటానికి ఇంటి నివారణలు

మోకాలు నొప్పి అనేది మోకాలి కీలు స్థిరంగా ఉండుట వలన వచ్చే ఒక సాదారణ వైద్య పరిస్థితి.ఈ పరిస్థితి వృద్ధులు,పెద్దలు,యువకులు ఇలా అందరిలోనూ సంభవిస్తుంది.

 Natural Home Remedies For Knee Pain-TeluguStop.com

పురుషుల కంటే మహిళల్లో మోకాలు నొప్పులు ఎక్కువగా ఉంటాయి.

మోకాలు నొప్పి స్థానం మారవచ్చు.

నొప్పి అనేది మోకాలి కీలుతో కూడిన అస్థి నిర్మాణాలు (తొడ ఎముక, కాలి మరియు కాలి చీలమండ), మోకాలిచిప్ప లేదా స్నాయువులు మరియు మృదులాస్థి ఎక్కడైనా ఉండవచ్చు.

మోకాలు నొప్పి కారణంగా ఎముక నిర్మాణం బలహీనం అవుతుంది.

అలాగే నొప్పి ఉన్న కాలిలో మోకాలి దృఢత్వం, గుర్తించదగ్గ వాపు, ఎరుపు, తిమ్మిరి మరియు నడవటానికి మరియు నిలబడటానికి కష్టంగా ఉంటుంది.మోకాలు నొప్పులను సులభంగా తగ్గించుకోవటానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి.ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

1.ఐస్ ప్యాక్

మోకాలు మీద ఐస్ ప్యాక్ పెడితే నొప్పి మరియు వాపు చాలా సమర్ధవంతంగా తగ్గిస్తుంది.ప్రభావిత ప్రాంతంలో ఐస్ ప్యాక్ పెట్టటం వలన రక్త నాళాలను బిగుతుగా చేసి, రక్త ప్రవాహాన్ని తగ్గించి వాపును తగ్గిస్తుంది.

నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

* ఒక పలుచని టవల్ లో ఐస్ ముక్కలను వేసి చుట్టాలి
* మోకాలు యొక్క ప్రభావిత ప్రాంతంలో పెట్టి పది నిముషాలు ఉంచాలి
* ప్రతి రోజు రెండు సార్లు ఈ విధంగా చేస్తే నొప్పి తగ్గుతుంది

2.

ఆపిల్ సైడర్ వినెగర్

ఆపిల్ సైడర్ వినెగర్ కూడా మోకాలు నొప్పిని తగ్గించటంలో సహాయపడుతుంది.దీనిలో అల్కలిన్ లక్షణాలు ఉండుట వలన మోకాలి కీలు లోపల ఖనిజ నిర్మాణాలు మరియు హానికరమైన విషాన్ని కరిగించటానికి సహాయపడుతుంది.

అలాగే కీళ్ళకు లుబ్రికాంట్ గా పనిచేస్తుంది

* రెండు కప్పుల నీటిలో రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ఒక టానిక్ వలే రోజంతా త్రాగుతూ ఉండాలి
* వేడి నీటి స్నానపు తొట్టెలో రెండు కప్పుల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపాలి.ఈ తొట్టెలో మోకాలును అరగంట సేపు ఉంచాలి
* ఒక స్పూన్ ఆలివ్ నూనె, ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి మోకాలుపై మసాజ్ చేయాలి.

3.కారపు పొడి

కారపు పొడిలో క్యాప్సైసిన్ సమృద్దిగా ఉండుట వలన నొప్పి నివారణగా పనిచేస్తుంది.క్యాప్సైసిన్ లో నొప్పి నివారిణి లేదా నొప్పి ఉపశమనం లక్షణాలు ఉండుట వలన నొప్పి తగ్గించటంలో సహాయపడతాయి.

* అరకప్పు ఆలివ్ నూనెలో రెండు స్పూన్ల కారపు పొడిని కలపాలి.ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో వారానికి రెండు సార్లు రాయాలి
* పావు కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఒక స్పూన్ కారపు పొడిని కలిపి దానిలో ఒక కాటన్ క్లాత్ ముంచి, దానిని నొప్పి ఉన్న ప్రాంతంలో వేసి అరగంట అలా వదిలేయాలి.

ఈ విధంగా రోజులో రెండు సార్లు చేయాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube