ముడతల నివారణకు... ఫ్రూట్ మరియు వెజిటెబుల్ ప్యాక్స్

ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరు ముడతలతో ఇబ్బంది పడుతున్నారు.ఈ సమస్య నివారణకు మనకు అందుబాటులో ఉండే పండ్లు మరియు కూరగాయలు చాలా బాగా సహాయపడతాయి.వాటితో ప్యాక్స్ తయారుచేసుకొని ముడతలను నివారించవచ్చు.

 Natural Facial Packs To Fight Wrinkles Details, Wrinkles, Facial Packs, Fruits,-TeluguStop.com

కుకుంబర్ టానిక్

కీరదోస కాయను తురిమి రసం తీసుకోవాలి.స్పూన్ కీరదోస రసంలో పావు స్పూన్ నిమ్మరసం, పావు స్పూన్ పన్నీరు కలిపి చర్మానికి పట్టించాలి.ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి.

క్లిన్సింగ్ లోషన్

ఒక స్పూన్ పాలలో ఒక స్పూన్ కీరదోస రసం, పావు స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి,మెడకు రాసి కాటన్ తో శుభ్రంగా తుడిచేయాలి.ఇది చర్మ రంద్రాలను శుభ్రపరుస్తుంది.

క్యాబేజీ మాస్క్

రెండు క్యాబేజి ఆకులను తురిమి లేదా గ్రైండ్ చేసి రసం తీసుకోవాలి.ఈ రసంలో పావు స్పూన్ ఈస్ట్ లేదా పుల్లటి పెరుగు, ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి, మెడకు రాయాలి.

పావుగంట తర్వాత నీటితో ముంచిన కాటన్ బాల్ సాయంతో తుడవాలి.ఈ ప్యాక్ ముడతలను తగ్గించి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube