ఒకప్పటి క్రీడాకారుడు..ఇప్పుడు బిచ్చగాడు

చదరంగం ఎత్తులకి పై ఎత్తులు వేయాలి.ఎదుటి ఆటగాడిని చిత్తు చేయాలి.

 National Chess Player Becomes Beggar Today-TeluguStop.com

ఇది ఈ ఆట నీతి.అయితే ఈ ఆటలో ఎన్నో ఎత్తులు చూసిన ఒక ఆటగాడు.

ఎన్నో విజయాల్ని సొంతం చేసుకున్న ఆటగాడు మాత్రం .జీవితంలో ఓడిపోయాడు.ఎన్నో పధకాలు అందిపుచ్చుకున్న ఆ క్రీడాకారుడు ఇప్పుడు పూట గడవక అడుక్కుంటున్నాడు.వింటే ఎంతో భాదని కలిగిస్తున్న ఈ సంఘటన మరొకరికి జరగకూడదు అని అనుకుంటాం.వివరాలలోకి వెళ్తే

ఎం.వై రాజు అంటే తొంబైలలో తెలియని వారు ఉండరు.జాతీయ స్థాయి క్రీడాకారుడుగా తన ప్రతిభని చాటాడు.రెండు వేల రేటింగ్‌ కలిగిన ప్రతిభాశాలి.జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులతో పాటు బంగారుపతకం కూడా అందుకున్న ఆటగాడు.నగరంలో ఎక్కడ చెస్‌ టోర్నమెంట్‌ జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు.

ఒకప్పుడు రైల్వేలో మంచి ఉద్యోగం.చదరంగంలో రాణింపు.

కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.జీవితంలో అన్నీ కోల్పోయాడు.

ఆటకూ దూరమయ్యాడు.నాఅన్నవారే లేక యాచకుడిగా మారాడు.

రాజు ఒంగోలులో 1969లో పుట్టారు.తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో తరచూ బదిలీల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది రాజు ప్రతిభని గమనించిన తండ్రి రాజును బాగా ప్రోత్సహించారు.రూ.3 లక్షలు విలువ చేసే చదరంగం పుస్తకాల్ని అప్పట్లో కొనిచ్చారు.అదే స్ఫూర్తితో ఎదిగిన రాజు జాతీయస్థాయిలో క్రీడాకారుడిగా రాణించారు.ఆ ప్రతిభతోనే 1993లో దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం సాధించారు

తల్లి తండ్రులని పోగొట్టుకున్న రాజు.తన జీవితం ఒక్కసారిగా ఆగిపోయింది.చెడు అలవాట్లకి బానిస అయ్యాడు.

క్రీడను నిర్లక్ష్యం చేశాడు.విధులకు గైర్హాజరుకావడంతో ఉద్యోగం పోయింది.

యాచకుడిగా మార్చింది.ఒక పక్క మానసిక పరిస్థితి బాగోలేదు.

నాలుగేళ్లుగా తార్నాక చౌరస్తాలోని గణపతిఆలయంలో యాచకుడిగా జీవితాన్ని గడుపుతున్నాడు.ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందిన కొందరు మిత్రులు రెండు నెలల క్రితం వైద్యపరీక్షలు చేయించారు.

స్కీజోఫ్రోనియాతో బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు.మెరుగైన వైద్యం చేయించేందుకు మిత్రులంతా ఓ గ్రూప్‌గా ఏర్పడి సాయంమందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఎన్నో జాతీయ అవార్డులు అందుకున్న రాజు ఇప్పుడు మానసిక స్థితి లేక.బిచ్చగాడిగా అడుకున్ని తినడం అందరిని భాదపెడుతోంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube