రెబల్‌ స్టార్‌ ఇక నటవిరాట్‌

రెబస్టార్‌ కృష్ణంరాజు నిన్నటి తరం హీరోల్లో స్టార్‌ హీరోగా నిలిచి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను ఏర్పర్చుకున్న విషయం తెల్సిందే.ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో రెబల్‌ పాత్రల్లో కనిపించి, అద్బుతంగా నటించి, యాంగ్రీ హీరోగా ఇమేజ్‌ను సొంతం రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజును నటవిరాట్‌ అనే బిరుదు ఇచ్చి సత్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 Nata Virat Title For Krishnam Raju-TeluguStop.com

ప్రముఖ రాజకీయ మరియు వ్యాపారవేత్త అయిన టి.సుబ్బిరామిరెడ్డి కృష్ణంరాజుకు ఈ బిరుదును ప్రధానం చేయనున్నాడు.

ఈనెల 7న జరుగబోతున్న కార్యక్రమంలో కృష్ణంరాజును వైభవంగా సత్కరించి, బంగారు కంకణం తొడిగి, నటవిరాట్‌ బిరుదను కృష్ణంరాజుకు ఇవ్వనున్నట్లుగా టి.సుబ్బిరామిరెడ్డి అధికారికంగా ప్రకటించాడు.ఈ వేడుకకు రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరు అయ్యే అవకాశాలున్నాయి.ఇప్పటి వరకు రెబల్‌స్టార్‌గా పిలువబడిన కృష్ణంరాజు ఇకపై నటవిరాట్‌ కృష్ణంరాజుగా పిలువబడుతాడు.

సినిమాలతో పాటు, రాజకీయంగా కూడా కృష్ణంరాజు స్టార్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం బిజేపీకి సన్నిహితంగా ఉంటున్నాడు.

కృష్ణంరాజుకు నటవిరాట్‌ బిరుదు కరెక్ట్‌గా సూట్‌ అవుతుందని ఆయన అభిమానులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube