కేంద్రానికి ఏపీ మీదనే దయట...!

కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ మీదనే దయ ఎక్కువగా ఉందట.ఆ రాష్ర్టానికే సానుకూలంగా ఉందట.

 Centre ‘more Generous’ To Andhra Pradesh-TeluguStop.com

ఇలాంటి మాటలు ఎవరంటారు? తెలంగాణ నాయకులే కదా.ప్రస్తుతం ఐటీ అండ్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, సీఎం కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ అన్నారు.రెండు రాష్ర్టాల మధ్య ఐఏఎస్‌ అధికారుల పంపిణీకి తొమ్మిది నెలల సమయం తీసుకుందన్నారు.హైకోర్టు విభజన ఇంకా పూర్తి కాలేదన్నారు.ఉద్యోగుల విభజనకు ఏర్పాటు చేసిన కమిటీ తన పని ఇంకా పూర్తి చేయలేదన్నారు.కేంద్రం ఏ కొద్దిపాటి సాయం చేయకున్నా తాము బాగా పనిచేస్తున్నామని కేటీఆర్‌ అన్నారు.

రెండు రాష్ర్టాల మధ్య నీటి గొడవలవంటివి చాలా సహజమేనన్నారు.కేంద్రం ఆంధ్రకే అనుకూలంగా ఉందని తెలంగాణ నాయకులు చెబుతూనే ఉంటారు.

ఎందుకంటే భాజపా-టీడీపీ మిత్రపక్షాలు కాబట్టి.కాని వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కేంద్రం తమను మోసం చేసిందని ఆంధ్రావారు మండిపడుతున్నారు.ఆందోళనలు చేస్తున్నారు.

అక్కడ భాజపా-టీడీపీ మధ్య స్నేహం ఎప్పుడు చెడిపోతుందో తెలియని పరిస్థితి ఉంది.ప్రత్యేక హోదా ఇస్తామని మంత్రి వెంకయ్య నాయుడు తదితరులు మాటలు చెబుతున్నారేగాని పని చేయడంలేదు.

ఆంధ్రప్రదేశ్‌ దయనీయ స్థితిలో ఉంటే కేంద్రం దయ ఆ రాష్ర్టం మీద ఉన్నట్లు కేటీఆర్‌కు అనిపిస్తోంది.ఈ రాజకీయం మామూలే కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube