2019లో ఎమ్మెల్యేగా లోకేశ్‌.... ఆ రెండు స్థానాలే గురి..!

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేశ్ రాజ‌కీయారంగ్రేటం చాలా స్పీడ్‌గానే జ‌రిగింది.ఎమ్మెల్సీ అయిన మూడు రోజుల‌కే లోకేశ్ మంత్రి అయ్యారు.

 Nara Lokesh As Mla In 2019-TeluguStop.com

అది కూడా త‌న తండ్రి కేబినెట్‌లో కీల‌క‌మైన పంచాయ‌తీరాజ్‌, ఐటీ శాఖ‌ల‌ను ఆయ‌న ద‌క్కించుకున్నారు.ప్ర‌స్తుతం ఇన్‌డైరెక్టుగా చ‌ట్ట‌స‌భ‌ల్లోకి ఎంట్రీ ఇచ్చిన లోకేశ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం డైరెక్టు ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డం క‌న్‌ఫార్మ్ అయ్యింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో లోకేశ్ నేరుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి డైరెక్ట్ ఎన్నిక‌ల్లోను తానేంటో ఫ్రూవ్ చేసుకోవాల‌నుకుంటున్నాడు.ఈ క్ర‌మంలోనే లోకేశ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో కీల‌క‌మైన కృష్ణా జిల్లా నుంచి బ‌రిలోకి దిగేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోన్న‌ట్టు తెలుస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో లోకేశ్ జిల్లాలోని గుడివాడ లేదా పెన‌మ‌లూరు నుంచి పోటీ చేస్తార‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే గుడివాడ‌లో ధీటైన ప్ర‌త్య‌ర్థిగా ఉన్న కొడాలి నానిపై లోకేశ్ ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు.

ఇటీవ‌ల లోకేశ్ అక్క‌డ ఓ వార్డుకు జ‌రిగిన ఉప ఎన్నిక‌ను సైతం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవాల‌ని పైనుంచి సీరియ‌స్‌గా ఆదేశాలు జారీ చేశారు.దీంతో గుడివాడ మునిసిపాలిటీలో 19వ వార్డుకు జ‌రిగిన ఎన్నిక‌లో టీడీపీ 149 ఓట్ల తేడాతో విజ‌యం సాధించింది.

ఇదంతా వ‌చ్చ ఎన్నిక‌ల్లో నానిని ఓడించేందుకు ముంద‌స్తుగా జ‌రుగుతోన్న ప్లాన్ అన్న టాక్ జిల్లాలో ఇప్ప‌టికే వ‌చ్చేసింది.

ఇక గుడివాడ కాక‌పోతే టీడీపీకి బ‌ల‌మైన కంచుకోట‌గా ఉన్న పెన‌మ‌లూరు నుంచి అయినా లోకేశ్ పోటీ చేయ‌డం దాదాపు ఖ‌రారే అంటున్నాయి టీడీపీ వ‌ర్గాలు.

లోకేశ్‌కు సొంత జిల్లా చంద్ర‌గిరి ఆప్ష‌న్‌గా ఉన్నా ఇప్ప‌టికే తండ్రి చంద్ర‌బాబు అదే జిల్లా కుప్పం నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తుండ‌డంతో ఇక లోకేశ్ కీల‌క‌మైన కృష్ణా జిల్లా నుంచి బ‌రిలోకి దిగాల‌ని యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube