లోకేష్ మంత్రి వ‌ర్యా.. ఇలాగైతే ఎలాగ‌య్యా..?

ఏపీ మంత్రి వ‌ర్గంలో లోకేష్ ఇప్పుడు సెంటరాఫ్‌ది టాపిక్‌గా మారాడు.నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న ఆయ‌న‌ను చంద్ర‌బాబు ఏకంగా మంత్రిని చేశారు.

 Nara Lokesh Again Slips Tongue In Anantapur Meeting-TeluguStop.com

దీంతో నారా వారి కుటుంబం, టీడీపీ త‌మ్ముళ్లు ఆనందం వ్య‌క్తం చేశారు.ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

అయితే, మంత్రి అయ్యాక లోకేష్ ప్ర‌వ‌ర్త‌నే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.సాధార‌ణంగా కొత్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు కాబ‌ట్టి.

తొలినాళ్ల‌లో ఒకింత త‌డ‌బాటు ఉండ‌డం ఖాయం.కానీ, మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జరిగి రెండు వారాలు పూర్త‌యిపోయినా.

కూడా లోకేష్ ఇంకా త‌డ‌బ‌డుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

బహిరంగ సభల్లో.

వేదికల్లో ఇటీవ‌ల‌ తన మాటల ద్వారా అభాసుపాలు అవుతున్నారు.ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే బొక్క బోర్లా పడ్డారు.

మంత్రి బాధ్యతలు స్వీకరించటానికి వస్తూ వస్తూ పెన్ను లేకుండా వచ్చి.ఎవరి దగ్గరో పెన్ను తీసుకుని సంతకాలు పెట్టారు.

అంబేద్కర్ జయంతిని.వర్థంతి చేశారు.

పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మంచినీటి సమస్య లేకుండా చేస్తానని చెప్పబోయి…తాగునీటి సమస్య ఏర్పాటే తన లక్ష్యమని ప్రకటించారు.ఇప్పుడు తాజాగా అనంతపురం సభలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మొత్తం 200 స్థానాల్లో గెలిపించాలని కార్యకర్తలను ఆయన కోరారు.

వాస్త‌వానికి ఇప్పుడు ఏపీలో మొత్తం 175 స్థానాలే ఉన్నాయి.ఒక‌వేళ రాజ్యాంగ స‌వ‌ర‌ణ జ‌రిగి పెంచినా.

, ఆ సంఖ్య 253కి పెరుగుతాయి.కానీ మ‌న మంత్రి వ‌ర్యులు లోకేష్ మాత్రం 200 స్థానాల్లో గెలిపించాల‌ని పిలుపునిచ్చారు.

సీట్ల సంఖ్య పెర‌గ‌క‌ముందే ఈ విధంగా అవ‌గాహ‌న లేని పిలుపులు ఇవ్వ‌డం ఎందుక‌ని తెలుగు త‌మ్ముళ్లు ప్ర‌శ్నిస్తున్నారు.మ‌రి లోకేష్ ఇక‌నుంచైనా మార‌తాడో లేడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube