బ్రాహ్మ‌ణి సర్వే...జ‌గ‌న్ సీఎం ఖాయ‌మేనా...!

స‌ర్వేల సీఎంగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం చంద్ర‌బాబుకు దిమ్మ‌తిరిగే న్యూస్ ఇది!! ఇప్ప‌టి వ‌ర‌కు త‌న ఎమ్మెల్యేలు, త‌న మంత్రులు, త‌న పాల‌న గురించి త‌న‌కు తానే ర‌హ‌స్యంగా స‌ర్వేలు చేయించుకుంటూ.ఫ‌లితాలు ఎలా ఉన్నా.

 Nara Brahmani Tdp Survey Shocks To Ap Cm-TeluguStop.com

బాగున్నాయ‌నే విధంగా ప్ర‌క‌ట‌న‌లు గుప్పించుకుంటున్న సీఎం చంద్ర‌బాబుకు తాజాగా ఓ స‌ర్వే విడుద‌ల చేసిన రియ‌ల్ రిజల్ట్ తెలిస్తే.షాక్ అవ్వ‌క‌త‌ప్ప‌దు! ఇక్క‌డ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.

ఈ స‌ర్వే చేయించింది ఎవ‌రో కాదు.సాక్షాత్తూ.

బిజినెస్ టైకూన్‌గా ఎదుగుతున్న సీఎం గారి ఏకైక కోడ‌లు బ్రాహ్మ‌ణి! మ‌రి ఆ స‌ర్వే ఫ‌లితాలు చిత్త‌గిద్దాం.!

ఏపీ చంద్ర‌బాబు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభ‌మై అప్పుడే రెండున్న‌రేళ్లు ముగిసిపోయాయి.

మ‌రో సారి ఎన్నిక‌ల‌కు అంటే 2019 ఎన్నిక‌ల‌కు కేవ‌లం రెండున్న‌రేళ్ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది.దీంతో త‌న పాల‌న‌, త‌న ఎమ్మెల్యేల ప‌నితీరు వంటి వాటిపై ప్ర‌జ‌ల్లో ఎలాంటి యాంటీ వాతావ‌ర‌ణం రాకూడ‌ద‌నే భావంతో త‌న‌కు తానే స‌ర్వేల‌కు శ్రీకారం చుట్టారు సీఎం.

ఈ క్ర‌మంలో అటు ఎమ్మెల్యేలు కొంత అదుపుత‌ప్పుతున్నార‌ని చెబుతూనే త‌న పాల‌న‌కు 99% మార్కులు వేసుకున్నారు.వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు దాదాపు సగం కూడా నెర‌వేర్చ‌లేద‌నేది వాస్త‌వం.

ముఖ్యంగా డ్వాక్రా రుణాలు, నిరుద్యోగ భృతి, కాపు రిజ‌ర్వేష‌న్‌, ప్ర‌భుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ వంటివి పెండింగ్‌లోనే ఉన్నాయి.అయినా కూడా బాబు స‌ర్వేలో ఆయ‌న‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నారు.

ఇదిలావుంటే, మ‌రోప‌క్క‌, బాబు కోడ‌లు బ్రాహ్మ‌ణి తాజాగా ర‌హ‌స్యంగా ఓ స‌ర్వే చేయించార‌ట‌.ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొస్తే.

అనే కాన్సెప్ట్‌తో జ‌రిగిన ఈ స‌ర్వేలో అసలు బండారం బ‌య‌ట‌ప‌డింది.రాష్ట్రంలో ఇప్పటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే 175 సీట్లకు గానూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనిష్టం గా 97 స్థానాల్లో జయకేతనం ఎగురవేసే అవకాశాలున్నాయని తేలింది.

రెండున్నరేళ్ల పాలన అనంతరం.చంద్రబాబు తీరుపై ఒక అంచనాకు వచ్చిన ప్రజానీకం ఇప్పుడు అవకాశం వస్తే వైసీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ అధ్యయనం లో తేలింద‌ని స‌మాచారం.

రాష్ట్రంలో ప్రాంతాల వారీగా చూసుకుంటే.గత ఎన్నికల్లో బాబు అధికారంలోకి రావడానికి కీలకంగా నిలిచిన గోదావరి – అనంతపురం జిల్లాల్లో టీడీపీకి తీవ్రమైన ఎదురుగాలి వీస్తోందని ఈ అధ్యయనంలో తేలింది.

డ్వాక్రా రుణాలు, రుణ‌మాఫీ, కాపు రిజ‌ర్వేష‌న్లు ఈ జిల్లాల్లో టీడీపీ పుట్టి ముంచ‌బోతున్నాయ‌ని స‌ర్వే కుండ‌బ‌ద్ద‌లు కొట్టిందట‌.

ఇక‌, ఈ స‌ర్వేలో మ‌రో ఆస‌క్తి క‌ర కోణం ఏంటంటే.2019లో టీడీపీ+బీజేపీ+ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన‌లు క‌లిసి కూట‌మిగా బ‌రిలోకి దిగితే.ఒకే ఒక్క‌డుగా జ‌గ‌న్ రంగంలో కాసుకుంటే.

ప‌రిస్థితి ఏంటి? అనే దానిపై స‌ర్వే ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది.వైకాపా 97 పై స్థాయి స్థానాల్లో విజయం సాధిస్తుంది ఆ కూటమి 70 స్థానాలకు పరిమితం అవుతుందని ఈ అధ్యయనం లో తేలింది.

సో.బ్రాహ్మ‌ణి స‌ర్వే నిజం అయితే, 2019లో వైకాపా అధినేత జ‌గ‌న్ క‌ల ఫ‌లించ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube