నారా బ్రాహ్మ‌ణి - గ‌ల్లా జ‌య‌దేవ్ డీల్ ఏంటి..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఫ్యామిలీలో ఇప్ప‌టికే ఆయ‌న సీఎంగా ఉంటే ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ మంత్రిగా ఉన్నారు.ఇక బాబు వియ్యంకుడు బాల‌య్య ఎమ్మెల్యేగా ఉన్నారు.

 Nara Brahmani Galla Jayadev Deal-TeluguStop.com

ఇక వీరితో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి సైతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయ రంగంలోకి దూకేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.ఆమె రాజ‌కీయ ప్ర‌వేశం గ‌త ఆరేడు నెల‌లుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి.

బ్రాహ్మ‌ణి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు లేదా విజ‌య‌వాడ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ఆమె ముందుగా విజ‌య‌వాడ‌పై కాన్‌సంట్రేష‌న్ చేయ‌గా అక్క‌డ తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో విజ‌య‌వాడ కంటే గుంటూరు బెస్ట్ ఆప్ష‌న్ అవుతుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

విజ‌య‌వాడ‌లో సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని బ్రాహ్మ‌ణి పొలిటిక‌ల్ ఎంట్రీతో త‌న‌కు ఎర్త్ త‌ప్ప‌ద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం, చంద్ర‌బాబుపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.ఇక మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ సైతం టీడీపీలో చేరి ఇక్క‌డి నుంచే ఎంపీగా పోటీ చేసేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఆయ‌న చేస్తున్నారు.

ఆయ‌న ఇటీవ‌ల చంద్ర‌బాబును క‌ల‌వ‌డం కూడా ఈ వార్త‌ల‌కు ఊత‌మిచ్చింది.

ఇక బీజేపీ సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ సీటును తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

బీజేపీ నుంచి విజ‌య‌వాడ ఎంపీ టిక్కెట్టు ఆశిస్తోన్న వారిలో కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి, ప్ర‌స్తుత కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు కుమార్తె దీప ఉన్నారు.కుమార్తె దీప కోసం వెంక‌య్య ఈ సీటు ఇవ్వాల‌ని గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టే సూచ‌న‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఇన్ని చిక్కులు మ‌ధ్య విజ‌య‌వాడ కంటే గుంటూరు నుంచే పోటీ చేయ‌డం బెట‌ర్ అని బ్రాహ్మ‌ణి, బాబు, లోకేశ్ ఓ డెసిష‌న్‌కు వ‌చ్చార‌ట‌.బ్రాహ్మ‌ని గుంటూరు నుంచి పోటీ చేస్తే ప్ర‌స్తుతం అక్క‌డ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గ‌ల్లా జ‌య‌దేవ్‌కు ఆయ‌న సొంత జిల్లా చిత్తూరులోని చంద్ర‌గిరి అసెంబ్లీ సీటు ఇవ్వాల‌ని అనుకున్నారు.

అయితే జ‌య‌దేవ్ ఎంపీగా ఉండేందుకే మొగ్గు చూప‌డంతో ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు పంపుతాన‌ని బాబు హామీ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

అయితే ఈ క్ర‌మంలోనే జ‌య‌దేవ్‌కు బాబు ఓ కండీష‌న్ కూడా పెట్టిన‌ట్టు స‌మాచారం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ్రాహ్మ‌ణిని గెలిపించేందుకు ఎన్నికల‌కు ముందు ఆమెను ప్ర‌మోట్ చేయ‌డం, ఎన్నిక‌ల వేళ ఆమెకు ప్రచారం చేయ‌డంతో పాటు అక్క‌డ కొంత ఆర్థిక‌సాయం కూడా చేయాల‌ని బాబు చెప్పిన డీల్‌కు జ‌య‌దేవ్ ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది.ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత జ‌య‌దేవ్‌ను బాబు రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసేలా వీరి మ‌ధ్య ఒప్పందం కుదిరిన‌ట్టు స‌మాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube