నాన్నకు ప్రేమతో.... రివ్యూ

రేటింగ్ : 3.75/5

నాన్నకు ప్రేమతో సినిమాకి ఈ మధ్య కాలం లో ఎన్నడూ లేనంత హైప్ వచ్చింది.దానికి మొదటి కారణం డైరెక్టర్ సుకుమార్ కాగా రెండవ కారణం ఆయన ఎన్టీఆర్ ని చూపించిన కొత్త లుక్ అన్నమాట.కొత్త లుక్ లో ఎన్టీఆర్ చాలా పెర్ఫెక్ట్ గా కనిపించాడు ఆ ఆహార్యం, ఆ హెయిర్ స్టైల్ కే జనాలు థియేటర్ ల దగ్గర క్యూ కట్టేశారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

 Nannaku Prematho Movie Review-TeluguStop.com

సుకుమార్ మొన్న ప్రొడ్యూస్ చేసిన చిత్రం ‘కుమారీ 21 ఎఫ్’ కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి.సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలున్నా నాన్నకు ప్రెమతోకున్న క్రేజ్ దేనికి లేదు.బాహుబలి తర్వాత ఆ స్థాయి ధియేటర్లలో విడుద్లైన నాన్నకు ప్రెమతో ఆ అంచనాలను నిలబెట్టుకుందా లేదా అనేది మన సమీక్షలో చూద్దాం.

కథ :


అభిరాం (తారక్) కె.ఎం.సి కంపెని మొదలు పెడతాడు.అదే సమయంలో తన తండ్రి సుబ్రమణ్యం అలియాస్ రమేష్ చంద్ర ప్రసాద్ (రాజెంద్ర ప్రసాద్) కు సీరియస్ గా ఉందని కాల్ రావడంతో అక్కడకు వెళ్ళిన అభి కి తన తండ్రి ఇక బ్రతకడని మహా అయితే నెల బ్రతకచ్చని తెలుస్తుంది.ఆ సమయంలో తన తండ్రి క్రిష్ణ మూర్తి చేతిలో 20 యేళ్ళ క్రితం మోస పోయానని ఎలాగన తను చనిపోయేలోగా క్రిష్ణ మూర్తి పతనం చూడాలని అదే తన చివరి కోరికగా చెప్తాడు.

అది తెలుసుకున్న తారక్ అందుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ మొదలుఎడతాడు అందులో భాగంగా దివ్యాంక (రకుల్) ని ప్రేమిస్తున్నట్టు నమ్మిస్తాడు.ఇక అక్కడనుండి అసలు కధ మొదలవుతుంది.

క్రిష్ణ ముర్తి పై అభి ఎలా గెలిచాడు.అసలు తన కంపెనీ కి క్రిష్ణ్ మూర్తి కి ఉన్న సంబంధం ఏంటి తన ముప్పై ఐదు వేల కోట్ల ఆస్తి ని సున్నా చేసి రోడ్డు మీద ఎలా నిలబెట్టాడనేది చూసి తెలుసుకోవాల్సిందే

పాజిటివ్ లు :


ఈ సినిమా కి అవుట్ అండ్ అవుట్ బలం అందించింది హీరో ఎన్టీఆర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.సరైన డైరెక్టర్ వాడాలే కానీ ఎన్టీఆర్ చాకు లాగా నటిస్తాడు అని అందరికీ తెలిసిన విషయమే.తండ్రికి కొడుకుగా అభిరాం పాత్రలో ఎన్టీఆర్ నటించిన తీరు అబ్బుర పరుస్తుంది.

అతని స్టైల్, ఆహార్యం ,డైలాగ్ డెలివరీ అదరహో అనిపించక మానవు.జగపతి బాబు తో వచ్చిన సీన్ లలో జగపతి కి సైలెంట్ గా మాట్లాడుతూ నే ఊహించని పంచ్ లు చేస్తూ అదిరిపోయే నటన చేసాడు ఎన్టీఆర్ తండ్రికోసం తనయుడుగా బాధ్యతల్ని నిర్వహించే పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు.

ఇక యాక్షన్ సీన్లలో ఇతని పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.ఎమోషనల్ సన్నివేశాల్ని అయితే పూర్తిగా పండించేశాడు.

మునుపటి చిత్రాలతో పోల్చుకుంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో సూపర్బ్.రాకుల్ చాలా గ్లామరస్ గా కనిపించింది.

జగపతి బాబు సినిమాకి మరొక విభిన్నమైన క్యారెక్టర్ గా చాలా బాగా చేసాడు.రాజేంద్ర ప్రసాద్ పాత్ర మెయిన్ అయినా ఎక్కువ సేపు ఆయన తెర మీద కనపడలేదు.

సుకుమార్ రాసుకున్న స్క్రిప్ట్ చాలా రొటీన్ అయినా చాలా చక్కటి కొత్తదైన ట్రీట్మెంట్ తో సినిమా సాగింది.సినిమా ఆసాంతం లాజిక్స్ , మైండ్ గేమ్స్ చుట్టూ కథ నడిచింది .

నెగెటివ్ లు :


ఫస్ట్ హాఫ్ ని చాలా అద్భుతంగా చూపించిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి కాస్త డుల్ చేసాడు.మళ్ళీ LEAD అనే సీన్ లు వచ్చినప్పుడు మళ్ళీ సినిమాని లేపాడు.

ఫస్ట్ హాఫ్ లో ఆసక్తికరంగా సాగిన కథాంశం సెకండ్ హాఫ్ లో పూర్తిగా నెమ్మదించింది.అక్కర లేని సీన్ లు చాలా కనపడ్డాయి సినిమాలో ఎక్కడా కామెడీ లేకపోవడం నెగెటివ్ పాయింటే.

రన్ టైం కూడా కాస్త నెగెటివ్ విషయం.ఎడిటింగ్ సరిగ్గా ఉంటే చాలా పర్ఫెక్ట్ గా ఉండి ఉండేది అని చెప్పచ్చు.

సినిమా ఆసాంతం ఆసక్తిగా సాగించి లాస్ట్ లో సరైన ముగింపు ఇవ్వలేదు.హ్యాకింగ్ అనే అతి సాధారణ విషయాన్ని లేవనెత్తి జగపతిబాబు ని ఎన్టీఆర్ పతనం లోకి దించడం కాస్త నమ్మసక్యంగా అనిపించదు .

మొత్తంగా .ఈ సంక్రాంతి కి బరిలో దిగిన మొట్ట మొదటి కోడి అయిన ఎన్టీఆర్ తన సత్తా చాటుతూ కొత్త పంథాలో ‘ నాన్నకు ప్రేమతో’ విడుదల చేసాడు.ఈ సినిమా ఆసాంతం అక్కడక్కడా బోర్ కొట్టినా ఆసక్తికరంగానే సాగుతుంది.సినిమా లోని స్క్రీన్ ప్లే – ఎన్టీఆర్ క్యారెక్టర్ ని మలచిన తీరు కోసం ఖచ్చితంగా ఒక్కసారి చూడాల్సిన సినిమా ఇది.కధ పరంగాచెప్పాలంటే నాన్నకు ప్రేమతో ఒక రివేంజ్ డ్రామా దీనికి సెంటిమెంట్ జోడించి కాస్త కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాడు సుకుమార్.కొన్ని కొన్ని సీన్లలో హీరో ఇంటెలిజెన్స్ ఓవర్ అయినట్టు అనిపిస్తుంది.సంక్రాంతి కి మిగితా సినిమాల తాకిడిని తట్టుకోగాలిగితే ఎన్టీఆర్ కి తిరుగు ఉండదు అనే చెప్పాలి.

రేటింగ్ : 3.75/5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube