బాలయ్య అభిమానిగా యువ హీరో!

టాలీవుడ్‌ స్టార్‌ హీరో బాలకృష్ణకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చాలా ఎక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోలు ఆ హీరో ఫేవరేట్, ఈ హీరో ఫేవరేట్‌ అంటూ ఉంటారు కాని, బాలకృష్ణ ఫేవరేట్‌ అని మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క హీరో కూడా అన్నది లేదు.

 Nani’s Next Movie Title Jai Balayya-TeluguStop.com

త్వరలో నాని ఆ మాట అనబోతున్నాడు.యువ హీరో నాని నందమూరి హీరో బాలకృష్ణకు హార్ట్‌కోర్‌ ఫ్యాన్‌గా ఒక సినిమాలో నటించేందుకు రెడీ అయ్యాడు.

ఇటీవలే ‘భలే భలే మొగాడివోయ్‌’ సినిమాను పూర్తి చేసిన నాని తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేసేందుకు కమిట్‌ అయిన విషయం తెల్సిందే.అనీల్‌ సుంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘జై బాలయ్య’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

బాలయ్య ఫ్యాన్స్‌ అసోషియేషన్‌కు అధ్యక్షుడిగా నాని కనిపించనున్నాడట.ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

మరి బాలయ్య అభిమానిగా నానిగాడు ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube