నాని మణిరత్నం సినిమా ఉందట..!

నాచురల్ స్టార్ నాని సినిమా చేస్తే హిట్ అనేంత పరిస్థితి కనబడుతుంది.స్టార్ హీరోలేమో వరుసెంట బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటే నాని మాత్రం వరుస హిట్స్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

 Nani Opens His Inner Feeling About Maniratnam Movie-TeluguStop.com

ప్రస్తుతం జెంటిల్ మన్ హిట్ జోష్ లో ఉన్న నాని తన తర్వాత సినిమా విరించి వర్మతో చేస్తున్నాడు.మజ్ఞు అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా తర్వాత నాని నక్కిన త్రినాధరావు సినిమా చేస్తున్నాడు.

అయితే లాస్ట్ ఇయర్ నాని మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

మరి ఏమైందో ఏమో గాని ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది.

ఇక నాని అడిగితే మాత్రం మణి సార్ తో సినిమా కచ్చితంగా ఉంటుందంటూ ఊరిస్తున్నాడు.ప్రస్తుతం కార్తితో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్న మణిరత్నం త్వరలో నాని హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట.

మణిరత్నం సినిమాలో నటిచాలనే నాని కోరిక ఇన్నాళ్లకు నెరవేరబోతుంది.మరి సౌత్ లో సూపర్ క్రేజ్ ఉన్న నాని మణి సినిమాతో మరింత స్టార్డం తెచ్చుకుంటాడనడంలో సందేహం లేదు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube