నాని 'నేను లోకల్' అంటున్నాడు..!

నాచురల్ స్టార్ నాని క్రేజ్ ఇప్పుడెలా ఉందో మాటలతో కాదు అతని సినిమా కలక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది.రీసెంట్ గా ఎన్నో అంచనాలతో వచ్చిన జెంటిల్ మన్ కూడా నాని మరోసారి ఆడియెన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు.

 Nani Movie Titled As Nenu Local-TeluguStop.com

ఇక చేస్తున్న సినిమాల విషయానికొస్తే ఉయ్యాల జంపాల దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న నాని ఆ సినిమాకు మజ్ఞు అనే టైటిల్ పెడుతున్నారన్న సంగతి తెలిసిందే.ఇక ఆ సినిమాతో పార్లర్ గా సినిమా చూపిస్త మావ దర్శకుడు నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో నాని ఓ సినిమా కమిట్ అయ్యాడు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘నేను లోకల్’ అనే టైటిల్ పెట్టబోతున్నారట.మాస్ మహారాజ్ రవితేజ ఇడియట్ సినిమాలో చంటిగాడు లోకల్ అనే డైలాగ్ కు కాస్త అటు ఇటుగా నాని ‘నేను లోకల్’ అనేస్తున్నాడు.

టైటిల్ చూస్తే ఇదో అల్లరి చిల్లరగా తిరిగే క్యారక్టరైజేషన్ తో కూడిన కథలా ఉంది.ప్రస్తుతం ఫాంలో ఉన్న నాని నేను లోకల్ అంటూ ఏ రేంజ్ లోకాలిటీని చూపించి హిట్ అందుకుంటాడో చూడాలి.

జెంటిల్ మన్ కోసమే రిస్క్ తీసుకుని చేసిన నాని ఇక నుండి తన మనసుకి నచ్చిన కథలను మాత్రం ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా చేసేస్తా అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు.ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మన్ సినిమా నానిలోని కాంఫిడెన్స్ లెవెల్స్ ను మరింత పెంచాయనడంలో సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube